మెగా బ్రదర్ నాగబాబు మరో సంచలన ట్వీట్.. ఈ సారి మాత్రం..

నాగబాబు (Facebook/Photo)

నాగాబాబు.. కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా పవన్ కళ్యాణ్ అన్నగా జనసేన పార్టీ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా నాథూరామ్ గాడ్సే పై ట్వీట్ చేసిన నాగబాబు.. తాజాగా మరో ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.

 • Share this:
  నాగబాబు.. కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా పవన్ కళ్యాణ్ అన్నగా జనసేన పార్టీ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో ఈయన నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎప్పటికపుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. నిన్నటి మొన్నటి వరకు ఈయన జబర్ధస్త్ షో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తాజాగా ‘అదిరింది’ అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే పై ట్వీట్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో మీడియా నాథూరామ్ గాడ్సే వాయిస్ వినిపించలేదన్నారు. గాంధీ చంపడము తప్పే కానీ.. ఆయన దేశభక్తిని శంకించలేమన్నారు. తాజాగా ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వేరు వేరు చోట్ల ఉన్న ఆస్తులను టీటీటీ విక్రయానికి పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు.


  తిరుపతి వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులను కాపాడే బాధ్యత తిరుపతి పాలక మండలిది. అంతేకా కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు.. హిందువుల మనోభావాలను దెబ్బ తీయకండి. నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాన్నారు. ఖచ్చితంగా టీటీడీ ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. టీటీడీ కేవలం శ్రీవారి ఆలయాల ధర్మకర్త మాత్రమే. విక్రేత కాదన్నారు.


  మరోవైపు నాగబాబు భారతీయులందరి ఒళ్లు పులకరించే మాట  జై హింద్. భారతీయులందరినీ ఏకం చేసే మాట. ఈ గొప్ప మంత్రాన్ని అన్నది ఒక తమిళ విప్లవవాది షణ్ముక పిళ్లై అన్నమాట. ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకుడు సుభాస్ చంద్రబోస్ భారతీయులందరినీ ఏకం చేసే మాట కావాలని అడిగిపుడు ఆ మాట ఆయనకు సజెస్ట్ చేపింది ఆయనే అంటూ చెప్పుకొచ్చారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published: