జబర్దస్త్‌లో నాగబాబుకు నో ఎంట్రీ.. మల్లెమాల సూపర్ షాక్..

Jabardasth Comedy Show: నాగబాబుకు, జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది. అసలు ఈయన కెరీర్ మళ్లీ రెక్కలు తొడిగిందే ఈ కామెడీ షో నుంచి. అప్పట్లో ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 10, 2020, 8:56 PM IST
జబర్దస్త్‌లో నాగబాబుకు నో ఎంట్రీ.. మల్లెమాల సూపర్ షాక్..
నాగబాబు (Twitter/Nagababu)
  • Share this:
నాగబాబుకు, జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది. అసలు ఈయన కెరీర్ మళ్లీ రెక్కలు తొడిగిందే ఈ కామెడీ షో నుంచి. అప్పట్లో ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు నాగబాబు. అలాంటి సమయంలో ఈయన కెరీర్‌కు మళ్లీ ఊపిరి ఊదింది జబర్దస్త్ కామెడీ షో. అలాంటి షోను వదిలేసి వెళ్లిపోయాడు ఈయన. మంచి పారితోషికం వచ్చినపుడు తప్పేం లేదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఇచ్చిన షోను వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది అంటూ కొందరు నాగబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్లిపోయాడు.

నాగబాబు (Twitter/nagababu)
నాగబాబు (Twitter/nagababu)


అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్‌లో టాప్‌లోనే ఉంది ఈ షో. దానికితోడు అదిరింది షోకు రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ జబర్దస్త్ ‌షోకు రావాలనే ఆలోచన నాగబాబు చేస్తున్నాడనే వార్తలొచ్చాయి. పైగా గెటప్ శ్రీను లాంటి వాళ్లు దీన్ని కన్ఫర్మ్ కూడా చేసారు. కానీ మల్లెమాల నుంచి మాత్రం నాగబాబుకు ఎంట్రీకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన రావడం మల్లెమాలకు పెద్దగా ఇష్టం లేదని చెబుతున్నాయి జబర్దస్త్ వర్గాలు.

నాగబాబు (Twitter/Nagababu)
నాగబాబు (Twitter/Nagababu)


దానికి కారణం కూడా లేకపోలేదు.. వెళ్లేప్పుడు మామూలుగా వెళ్లిపోయుంటే అసలు సమస్యే ఉండేది కాదు కానీ మల్లెమాలపై చాలా విమర్శలు చేసాడు నాగబాబు. ఏడేళ్లుగా జబర్దస్త్ కమెడియన్లకు చాలా అన్యాయం చేసారన్నట్లుగా మాట్లాడాడు ఈయన. అంతేకాదు కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నారంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రీ ఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయని తెలుస్తుంది.

నాగబాబు (Twitter/Nagababu)
నాగబాబు (Twitter/Nagababu)


మళ్లీ జబర్దస్త్‌కు రావాలనుకుంటున్నా కూడా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఆయన ఎంట్రీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. దానికి నిదర్శనమే.. జబర్దస్త్‌లో వారానికి ఓ కొత్త జడ్జిని తీసుకురావాడం. అవసరం అనుకుంటే ఇప్పటికే నాగబాబును తీసుకొచ్చేవాళ్లేమో కానీ మనో, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇలా ఒక్కో వారం ఒక్కొక్కరు దర్శనమిస్తున్నారు. ఏదేమైనా కూడా జబర్దస్త్‌పై నాగబాబు చేసిన విమర్శలే ఇప్పుడు ఈ రీ ఎంట్రీకి అడ్డుపడుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: February 10, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading