బుల్లితెరపై కామెడీ పంచే జబర్ధస్త్‌కు పోటీగా వచ్చిన అదిరింది ప్రొగ్రామ్... మెల్లిమెల్లిగా ఆడియెన్స్‌కు రీచ్ అవుతోంది. జబర్ధస్త్ నుంచి ఈ షోలోకి వెళ్లిన నాగబాబుతో పాటు పలువురు కమెడియన్లు... ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పటి జబర్ధస్త్ కమెడియన్లు, కొత్త వాళ్లు కలిసి... జబర్ధస్త్ ఆడియెన్స్‌ను తమ వైపు తిప్పుకునేందుకు బాగానే కష్టపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే తాను జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది ప్రొగ్రామ్‌లో జడ్జిగా ఓ వెటరన్ హీరోయిన్ను తీసుకొచ్చేందుకు నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జబర్ధస్త్ నుంచి నాగబాబు బయటకు వచ్చినా... ఆ షోను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లడంలో రోజా బాగా సక్సెస్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు మేల్ జడ్జీలు మారుతున్నా... ఆ లోటు కనిపించకుండా చేయడంలో రోజా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగబాబు లేని లోటు జబర్ధస్త్‌లో కనిపించకుండా చేయడంలో రోజా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే స్కిట్స్‌లో మరింతగా ఇన్వాల్వ్ అవుతున్నారు.
ఓ వైపు జబర్ధస్త్‌లో రోజా దూసుకుపోతుండటంతో... అదిరిందిలోనూ ఆమెకు ధీటుగా ఉండే లేడీ జడ్జిని తయారు చేయాలని నాగబాబు గట్టిగా డిసైడయ్యారని తెలుస్తోంది. లేడీ జడ్జి అంశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల్లో ఒకటని గుర్తించిన మెగా బ్రదర్... త్వరలోనే ఓ వెటరన్ హీరోయిన్ను తన పక్కన జడ్జి స్థానంలోకి తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే... ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కుర్ర హీరో నవదీప్ పోస్ట్ పోయినట్టే అని చెప్పకతప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adirindi, Adirindi comedy show, Jabardasth, Nagababu, Roja