news18-telugu
Updated: September 16, 2020, 11:33 AM IST
Naga Babu (నాగబాబు)
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగా బ్రదర్, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన నాగబాబు.. కరోనా నుండి త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు నాగబాబు ట్వీట్ చేసిన వెంటనే మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ అని కొద్దిరోజుల క్రితం నుంచే వార్తలు వస్తున్నాయి.
కరోనా లక్షణాలు కనిపించడంతో నాగబాబు టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం నాగబాబు హోమ్ క్వారెంటైన్లో ఉన్నాడని సన్నిహితులు తెలిపారు. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తనకు కరోనా వచ్చినట్టు స్వయంగా నాగబాబు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
September 16, 2020, 11:28 AM IST