ఎమ్మెల్యే రోజా, ఆలీని టార్గెట్ చేసిన నాగబాబు...జబర్దస్త్‌పై కసి తీర్చుకున్నాడుగా...

తాజాగా జీ తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించిన నాగబాబు, తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

news18-telugu
Updated: December 8, 2019, 6:13 PM IST
ఎమ్మెల్యే రోజా, ఆలీని టార్గెట్ చేసిన నాగబాబు...జబర్దస్త్‌పై కసి తీర్చుకున్నాడుగా...
నాగబాబు, రోజా, ఆలి (Image: Twitter)
  • Share this:
జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన నాగబాబు ఎలాగైన తనను బయటకు వెళ్లిపోయేందుకు కారణమైన వారిపై కసి తీర్చుకునేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా జీ తెలుగులో తన ప్రస్థానం ప్రారంభించిన నాగబాబు, తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు మరో ప్రోగ్రాంలో సైతం చీఫ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 'అదిరింది' పేరిట ప్రారంభానికి సిద్ధమవుతున్న రియాలిటీ షోలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోలో జబర్దస్త్ జడ్జి ఎమ్మెల్యే రోజా, మరో కొత్త జడ్జి కమెడియన్ ఆలీలను టార్గెట్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రోమో కాన్సెప్ట్ విషయానికి వస్తే ఎమ్మెల్యేగా ఓ లేడీ కేరక్టర్, కమెడియన్ అంటూ మరో కేరక్టర్ వచ్చినప్పటికీ షో స్టార్ట్ చేయరు. అయితే నాగబాబు స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఓ డైలాగ్ కూడా వదిలారు.

అందులో 'ఎంత మంది ఉన్నామన్నది కాదురా...ఎవడున్నాడన్నది ముఖ్యం.. మొదలు పెట్టండి..."అంటూ సాగే ఈ ప్రోమో నేరుగా జబర్దస్త్ ను టార్గెట్ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>