మంచు మోహన్ బాబు ఫ్యామిలీ (Mohan Babu) తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంచు ఫ్యామిలీకి హెయిర్ డ్రెస్సర్‌గా చేస్తోన్న నాగ శ్రీను.. తనపై నిందలు మోపి కేసు పెట్టారంటూ.. తన తప్పేం లేదని, మోహన్ బాబు, (Manchu Vishnu) మంచు విష్ణు తన కులాన్ని తిట్టారని అతడే స్వయంగా ఒక వీడియోలో వివరించిన సంగతి తెలిసిందే. దీంతో (Mohan Babu) మోహన్ బాబు ఫ్యామిలీ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. తమ మనోభావాలను దెబ్బతీశారని, (Mohan Babu మోహన్ బాబు, మంచు విష్ణు బహిరంగంగా నాగ శ్రీనుకు, నాయీ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని నాయీ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇక అది అలా ఉంటే ఆ ఉప్పలపు నాగ శ్రీనుకు సాయంగా నిలబడ్డారు నటుడు నాగబాబు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాగ శ్రీను తల్లి ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు, అతనికి గత సంస్థ నుండి జీతం కూడా సరిగ్గా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్న అతని ఆర్ధిక స్థితికి చిరు సాయంగా 50,000/- రూపాయలు సినీ నిర్మాత కొణిదెల నాగబాబు (Nagababu) ఈరోజు అందజేయడం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అంతేకాదు సోదరుడు నాగ శ్రీను చిన్నారుల అనారోగ్య సమస్యకు పూర్తి వైద్య సహాయం సైతం అపోలో ఆసుపత్రి నందు అందించడానికి సకల ఏర్పాట్లకు మెగా సపోర్ట్ లభించిందంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర అనే వ్యక్తి ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్, పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక గత పదకొండేళ్లుగా మంచు ఫ్యామిలీ దగ్గర హెయిర్ డ్రెసర్‌గా పనిచేసిన నాగ శ్రీనుపై దొంగతనం ఆరోపణలు చేయడమే కాకుండా..ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేయించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై తాజాగా ప్రముఖ బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్యగారు స్పందించారు. అలాంటి నాగశ్రీను పై వ్యక్తిగతంగా కుల దూషణ చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ విషయమై (Mohan Babu) మోహన్ బాబు.. నాయీ బ్రహ్మాణ సంఘంతో పాటు బీసీ జాతి మొత్తానికి క్షమాపణాలు చెప్పాలని బీసీ సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జనాభాలో ఒక్క శాతం కూడా లేని మీరు.. 56 శాతం ఉన్న జనాభా బీసీలను వ్యతిరేకంగా మాటలు మాట్లాడి అవమానిస్తారా అంటూ ధ్వజమెత్తారు. డబ్బులుంటే అయిపోతుందా.. సినీ హీరో అయితే.. ఏమన్నా మాట్లాడుతారా.. ఈ అగ్రకుల దురంహకారంతో పేద కులాలను అవమానించేలా మాట్లాడుతారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక మోహన్ బాబు (Mohan Babu) విషయానికి వస్తే.. ఆయన గురించి కొత్తగా సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఈయన నటించిన (Son of India) ‘సన్ ఆఫ్ ఇండియా’ విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో, బుకింగ్స్ విషయంలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. వివిధ రకాల మీమ్స్‌తో మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ విరుచుపడ్డారు. అయితే ఈ విషయంపై మంచు ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ట్రోలర్స్ పై రూ. 10 కోట్లు దావా వేస్తున్నట్టు ప్రకటించారు. హీరో నుంచి విలన్‌గా.. ఆపై కథానాయికుడిగా ఒకప్పడు తను ఏ హీరోల సినిమాల్లో విలన్‌గా చేసాడో.. ఆయా హీరోలకు ధీటుగా తన సినిమాలకు కలెక్షన్స్ కొల్లగొట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. ఇండస్ట్రీలో కొత్త నీరు వచ్చినపుడు.. ఆటోమేటిగ్‌గా పాత నీరు బయటకు పోతుంది.
మోహన్ బాబు పై బీసీ సంఘాల నేతలు ఫైర్#MohanBabu #Tollywood https://t.co/y9fPWOV0fH
— News18 Telugu (@News18Telugu) March 3, 2022
అదే రీతిలో ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసిన ఈయన మార్కెట్ పూర్తిగా డల్ అయింది. ఇక మోహన్ బాబు సినిమాలు విడుదలైతే.. ఓపెనింగ్స్ తక్కువగానే వస్తాయని అంతా ఊహించారు. కానీ ఊహించని విధంగా అసలు ఓపెనింగ్స్ కూడా రావని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’ (Son Of India collections) విషయంలో ఇదే జరిగి మోహన్ బాబుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 550కి పైగా సినిమాలు చేసిన ఈయనకు ఇంతకంటే ఘోరమైన పరాభవం ఇంకోటి ఉండదంటున్నారు ఫ్యాన్స్. మొత్తంగా నెగిటివ్ కలెక్షన్స్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా చరిత్ర కెక్కింది సన్ ఆఫ్ ఇండియా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Manchu Lakshmi, Mohan Babu