Nagababu : నిహారిక కారణంగా మరోసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న : నాగబాబు

నాగబాబు, నిహారిక Photo : Twitter

Niharika Konidela : నాగబాబు(Nagababu) నిర్మాతగా రామ్ చరణ్‌ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారీగా నిర్మించిన చిత్రం ‘ఆరెంజ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.

  • Share this:
    నాగబాబు కొణిదెల.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా నాగబాబు నటుడుగాను, నిర్మాతగాను రియాలిటీ షోలకు జడ్జ్‌గాను చేస్తూ తన కంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఆయన ప్రస్తుతం జీ తెలుగులో వచ్చే అదిరింది షోతో పాటు పలు టీవీషోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు నాగబాబు. ఈ షో ఆయనకు చాలా పేరుతో పాటు పాపులారిటీని తీసుకొచ్చింది. అది అలా ఉంటే నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్‌ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో భారీగా నిర్మించిన చిత్రం ‘ఆరెంజ్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దీంతో నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ సినిమా మిగిల్చిన నష్టాలను తట్టుకోలేక నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయనే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ఆ తర్వాత తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆదుకోవడంతో మళ్లీ నిలబడగలిగానని పేర్కోన్నాడు. అయితే తాను ఆత్మ హత్య చేసుకోవాలనీ మరో సందర్భంతో కూడా అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన తాజాగా అభిమానలుతో పంచుకున్నాడు. ఓ టీవీ షో కోసం రూపోందించిన ఆ కార్యక్రమంలో నాగబాబు చెప్పిన ఆ మాటలు.. దానికి సంబందిచిన ప్రోమో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    అయితే అసలు నాగబాబు మరోసారి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడో తెలిపాడు.. ఆ ప్రోమోలో.. ఆయన మాటల్లో.. ‘‘ఓసారి ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను. అయితే నేను అనుకుని నాలాగే డ్రస్ వేసుకున్న ఓ వ్యక్తితో నిహారిక వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ 20 నిమిషాల పాటు నిహారిక ఆచూకీ తెలియలేదు. దీంతో నాలో ఆందోళన మొదలైంది. ఆవేశం ఎలా ఉందంటే అప్పుడు.. ఆ దేశంలో ఉన్న వారందరినీ చంపేయాలన్నంత కోపం. అంతేకాదు ఆ క్షణం.. వరుణ్‌ తేజ్‌ను ఇంటికి పంపించి.. నా భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించా.. అని చెబుతూ తన కూతురు నిహారిక అంటే అంత ఇష్టం అని చెప్పాడు నాగబాబు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ నిహారిక లాంటి ఏంజెల్స్ పుడతారంటూ భావోద్వేగం అయ్యాడు.
    Published by:Suresh Rachamalla
    First published: