జబర్ధస్త్‌తో పాటు హైపర్ ఆదిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు..

నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అందరు నటీనటులు ఇంట్లోనే ఉండిపోయారు. ఇదే కోవలో నాగబాబు కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ చేసారు. ఈ సందర్భంగా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తో పాటు హైపర్ ఆదిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

 • Share this:
  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అందరు నటీనటులు ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొంత మంది తమ అభిమానులతో చిట్‌చాట్ చేస్తున్నారు. ఇదే కోవలో నాగబాబు కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ చేసారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాపై స్పందించారు. తాజాగా ఆయన జబర్ధస్త్ షో వీడటంతో పాటు హైపర్ ఆదిపై స్పందించారు. జబర్ధస్త్ షో నిర్వాహకులైన మల్లెమాల వాళ్లతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ షో నుంచి తప్పుకున్నాను. దాంతో వేరే ఛానెళ్లో అదే కాన్సెప్ట్‌తో అదిరింది ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ షో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా లాక్‌డౌన్ కారణంగా అదిరింది షో షూటింగ్ ఆగిపోయింది. దాంతో పాత ఎసిపోడ్స్ ప్రసారం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు నాగబాబు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి అదిరింది షోను మళ్లీ ప్రారంభం అవుతుందన్నారు. ఇలాంటి సమయంలో అదిరింది లాంటి షోను చేయడం సంతోషంగా ఉందన్నారు.

  నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)
  నాగబాబు, హైపర్ ఆది (twitter/Photo)


  జబర్ధస్త్ షోకు అదిరింది షోకు తేడా ఏమిటనే ప్రశ్నకు నాగబాబు సమాధానమిస్తూ.. జబర్ధస్త్‌లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి సీనియర్లు ఉన్నారు. అదిరింది ప్రోగ్రామ్‌లో చమ్మక్ చంద్ర, ఆర్పీ వంటి వారే కాకుండా జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు కొంత మంది ఉణ్నారు. కొత్తగా గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ రావడం వల్ల ఈ షోకు అదనపు ఆకర్షణగా మారిందన్నారు.ఇక జబర్ధస్త్ షోలో హైపర్ ఆది లాగా.. అదిరింది ప్రోగ్రామ్‌లో సద్దాం బాగా చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. రౌడీ బాయ్స్‌లో ఒకడవిగా వచ్చిన ఇతను హైపర్ ఆదిలా పేరు తెచ్చుకుంటున్నాడని పేర్కొన్నాడు. అదిరింది ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వచ్చినా.. జబర్ధస్త్ ప్రోగ్రామ్‌పై తన అభిప్రాయంలో ఎలాంటి మార్పులేదు. రెండు మంచి ప్రోగ్రామ్సే. ఇక జబర్ధస్త్ ప్రోగ్రామ్‌తోనే నాకు మంచి పేరు వచ్చిందన్నారు. అంతేకాదు త్వరలో అదిరింది కూడా జబర్ధస్త్ షోను మించిపోతుందన్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: