news18-telugu
Updated: June 21, 2019, 1:24 PM IST
ఏపీ సీఎం జగన్,నాగబాబు
2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడంతో పాటు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భవితవ్యంపై నాగబాబు తనదైనశైలిలో స్పందించారు. ఇటీవలే ఫేస్ బుక్ లైవ్‌లో నెటిజన్ల నుండి ఎదురైన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు నాగబాబు. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన ఓటమిపై కారణాలను వివరించారు. .ఇందులో భాగంగా జగన్ గెలుపునకు గల కారణాలు కూడా ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సందర్బోచింతంగా సమాధానం చెప్పారు. జగన్ కు ఇంతకముందు సీఎం గా పనిచేసివుంటే ఆయన చేసిన పనులు చూసి ఓటర్లు, ఓట్లు వేశారని అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఒక ఛాన్స్ ఇచ్చిచూద్దాం అనే సానూభూతితో ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకత కూడా జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిందన్నారు.

నాగబాబు,పవన్ కళ్యాణ్
మరోవైపు ఈవీఎం టాంపరింగ్ మీద అడిగిన ప్రశ్నకు సమాధానంగా 10 శాతం ట్యాంపరింగ్ చేసినా ఫలితాల్లో చాలా తేడాలు వస్తాయన్నారు. అయితే ట్యాంపరింగ్ జరిగిందన్న విషయం తీసెయ్యలేం అంటూ సమాధానమిచ్చారు.ఐనా నేను ఇంకాస్త ఎక్కువ ప్రచారం చేసివుంటే ఫలితం వేరుగా ఉండేదంటూ వ్యాఖ్యానించారు.ఎ లక్షన్ కమిషన్ ఈవీఎం టాంపరింగ్ పై సరైన వివరణ ఇవ్వలేదనిపించిందన్నారు. ఇక తన ఓటమికి గల కారణాలు చెబుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజం.నా రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్‌తో మొదలైంది. ఇకపై కూడా తమ్ముడితో కలసి పనిచేస్తాన్నారు. ఈ ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓడిపోయిన నరసాపురంలోనే ఎక్కువ కాలం గడపడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటమి విషయానికొస్త.. ఓటమికి బెదిరిపోయే వాడినికాదు అంటూ చెప్పుకొచ్చారు. పవన్ పై స్పందిస్తూ, తొలినుండి జనసేన లక్ష్యం 2024 అని పవన్ చెబుతూ వచ్చారు . ఈ సారి ప్రజలు జగన్ కు ఛాన్స్ ఇచ్చారు. 2024 లో కచ్చితంగా ఏపీ ప్రజలు పవన్ ను సీఎం చేస్తారంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక జగన్ పాలనను ప్రస్తావిస్తూ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది.,ఇంకా ఈ ప్రభుత్వం పై ఒక అభిప్రాయానికి రాలేను. కొంత సమయం ఇద్దాం.. ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెడతారో చూద్దాం అన్నాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
June 21, 2019, 1:24 PM IST