నెపోటిజంపై మాట్లాడుతూ.. మరోసారి బాలయ్యను మధ్యలోకి లాగిన నాగబాబు..

మెగాబ్రదర్.. తెలుగు ఇండస్ట్రీలో పాతకుపోయిన నెపోటిజంపై మాట్లాడుతూ.. మధ్యలో బాలయ్యతో పాటు నాగార్జున, వెంకటేష్‌లతో మిగతా హీరోలను ఇండస్ట్రీలో పైకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 

news18-telugu
Updated: August 27, 2020, 10:37 PM IST
నెపోటిజంపై మాట్లాడుతూ.. మరోసారి బాలయ్యను మధ్యలోకి లాగిన నాగబాబు..
నాగబాబు, బాలకృష్ణ (Youtube/Photos)
  • Share this:
మెగాబ్రదర్.. తెలుగు ఇండస్ట్రీలో పాతకుపోయిన నెపోటిజంపై మాట్లాడుతూ.. మధ్యలో బాలయ్యతో పాటు నాగార్జున, వెంకటేష్‌లతో మిగతా హీరోలను ఇండస్ట్రీలో పైకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో నెపోటిజం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ నాగబాబు మరోసారి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో నెపోటిజం గురించి హిందీ మీడియా కూడా ఎక్కువగా మాట్లాడుతోంది. బంధుప్రీతి ఉన్నంత మాత్రానా ప్రేక్షకులు ఆయా హీరోలను ఆదరిస్తారా అని ఎదురు ప్రశ్న వేసాడు. ఎవరైనా హీరోగా ఎదగాలంటే సొంత టాలెంట్ ఉండాల్సిందే అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడిగా హీరోగా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన బాలకృష్ణ.. ఆయన కంటూ ప్రత్యేకమైన నటన, డైలాగ్ డెలవరి వంటి వాటితో ప్రేక్షకాదరణ పొందారు. మరోవైపు నాగార్జున కూడా ఒకటి రెండు చిత్రాల వరకే తండ్రి పేరు వాడుకున్నాడు. ఆ తర్వాత ఆయన తన యాక్టింగ్ మరియు గ్లామర్ లుక్‌తో కింగ్ నాగార్జున అనిపించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒడ్డించిన విస్తరి కాదు. అలాగే వెంకటేస్, రానా, జూ. ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి చాలా మంది హీరోలు తమ ఓన్ టాలెంట్‌తోనే హీరోలుగా నిలదొక్కుకున్నారన్న విషయాన్ని చెప్పారు.



అటు ముందు తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి నటులు కూడా ఇండస్ట్రీకి వచ్చినపుడు వాళ్లు కొత్తే. వారసులు అయినంత మాత్రానా పరిచయం చేయకూడదనే రూల్ ఏమిలేదుగా. వారి మానానా వారిని ఒదిలేస్తామా అంటూ నెపోటిజం గురించి మాట్లాడుతున్న వారిపై ఒకింత ఫైర్ అయ్యారు. ఇండస్ట్రీలో నెపోటిజం అనే పదం వాడటం కామన్ అయిపోయింది. నెపోటిజం మాట వాడటం అనేది మీ చాతకానీతనం. అంతేకాదు చాలా మంది స్టార్ హీరోల కొడుకులు సక్సెస్ కాకుండా ఇళ్లకు వెళ్లినపోయినవారున్నారు. ఇండస్ట్రీలో రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి సక్సెస్ పుల్ హీరోలు ఓన్ గానే కష్టపడి పైకొచ్చారు. ఇక ఇండస్ట్రీ మొత్తం ఆ నలుగురి చేతిలో ఉంది అంటున్నారు. ఇదేమన్నా ధార్మిక కార్యక్రమమా.. పెద్ద సినిమాలు రిలీజైతే.. వాటికి కాస్తంత ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. మరోవైపు చిన్న సినిమాలను నిర్మించే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండి సినిమాలు తీస్తే అవి కూడా ఆడతాయనే దానికి నిదర్శనం కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు. మరోవైపు అల్లు అరవింద్ కేవలం మా ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీస్తున్నారు మా ఫ్యామిలీ వాళ్లను ప్రజలపై రుద్దతున్నారనే దానిపై మాట్లాడుతూ.. అరవింద్ కేవలం మా కుటుంబ హీరోలతోనే కాదు.. విజయ్ దేవకొండ, నాని, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్‌ వంటి వాళ్లతో సినిమాలు తీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 27, 2020, 10:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading