Naga babu: డబ్బు సంపాదన లేని వాడిని ఎవరు గౌరవించడు.. నాగబాబు మరో సంచలన వీడియో..

Nagababu | మెగా బ్రదర్ నాగబాబు..ఈ మధ్యకాలంలో తరుచుగా తన యూట్యూబ్ ఛానెల్.. మన ఛానల్.. మన ఇష్టం ద్వారా తాను చెప్పుదల్చుకున్న విషయాలను ఎలాంటి మెహమాటం కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. తాజాగా డబ్బు సంపాదించడం పై పెద్ద లెక్చరే ఇచ్చాడు.

news18-telugu
Updated: September 3, 2020, 7:32 PM IST
Naga babu: డబ్బు సంపాదన లేని వాడిని ఎవరు గౌరవించడు.. నాగబాబు మరో సంచలన వీడియో..
Nagababu | మెగా బ్రదర్ నాగబాబు..ఈ మధ్యకాలంలో తరుచుగా తన యూట్యూబ్ ఛానెల్.. మన ఛానల్.. మన ఇష్టం ద్వారా తాను చెప్పుదల్చుకున్న విషయాలను ఎలాంటి మెహమాటం కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. తాజాగా డబ్బు సంపాదించడం పై పెద్ద లెక్చరే ఇచ్చాడు.
  • Share this:
మెగా బ్రదర్ నాగబాబు..ఈ మధ్యకాలంలో తరుచుగా తన యూట్యూబ్ ఛానెల్.. మన ఛానల్.. మన ఇష్టం ద్వారా తాను చెప్పుదల్చుకున్న విషయాలను ఎలాంటి మెహమాటం కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. పనికిమాలిన వాళ్లు మాట్లాడే మాటలు నెపోటిజం అంటూ బాలీవుడ్ మీడియాపై మండిపడ్డాడు. వారసత్వం సినీ ఇండస్ట్రీలో ఈజీగా అడుగుపెట్టవచ్చు కానీ.. హీరోగా నటుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ల కృషి మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈయన డబ్బు సంపాదన పై మంచి లెక్చరే ఇచ్చాడు. ముఖ్యంగా మనిషికి బంధాలు బంధాలు ముఖ్యమా.. ప్రేమానురాగాలు ముఖ్యమా.. ప్రతీది డబ్బుతో కొనలేము. డబ్బుతో కొనలేనవి కొన్ని ఉంటాయి. అన్ని పనుల కంటే డబ్బులు సంపాదించడం అత్యంత గ్రేటెస్ట్ పని అని చెప్పాడు.


పేరు చెప్పను కానీ.. ఓ క్యారెక్టర్ ఆర్ధిస్ట్. అతను కోరుకోని హీరో లేడు. అతను అప్పులపై అప్పులు చేస్తూ ఉండేవాడు. నిజంగా ఒకవేళ అతని పొజిషన్‌లో ఉండి ఉంటే.. నేను రూ. రెండు మూడు వేల కోట్లు సంపాదించేవాడిని. నేను ఒక టైమ్‌లో నాకు ఉన్న అప్పు ఎంతో చూసుకుంటే భయమేసిది. ఎందుకులే జరిగిపోతుంది. మేనేజ్ చేస్తున్నాడులే. మనోడు అనేవాడు ఒకడున్నాడు. చూసుకుంటాడులే. అనుకొని అనుకొని నేను ఎంత దెబ్బ తిన్నామనే విషయం నాగబాబు చెప్పుకొచ్చాడు.

Naga babu tweet on china products after balayya issue,nagababu,naga babu,naga babu twitter,naga babu on china products,balakrishna,naga babu,balakrishna youtube interview,balakrishna respond on naga babu issue,naga babu twitter,balakrishna fans naga babu,naga babu vs balakrishna,naga babu controversy,naga babu balakrishna controversy,naga babu counter attack on balakrishna,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్,బాలకృష్ణ నాగబాబు,నాగబాబుపై సీరియస్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్,నాగబాబు ఇష్యూపై స్పందించిన బాలకృష్ణ,బాలకృష్ణ యూట్యూబ్,చైనా ప్రొడక్స్ పై నాగబాబు ట్వీట్,నాగబాబు మరో సంచలన ట్వీట్,
నాగబాబు (Twitter/Nagababu)


మన ఇంట్లో ఒక్క పైసా ఇవ్వకుండా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో భార్య, తల్లి తండ్రులు, పిల్లలు ఎవరు గౌరవించరు. బాధ్యతలు నెరవేర్చని వాడికి ప్రేమాభిమానాలు దొరకవు. మన హిందూ సంప్రదాయంలో డబ్బును లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ శ్రీ మహాలక్ష్మిగా కొలుస్తారు. మనీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. నువ్వు ఒక రోజు మొత్తం ఎలా గడుపుతావు. పొద ద్దునే లేచి టిఫిన్ చేసి.. రాత్రి ఇంత మందు తాగి భార్యా పిల్లలతో గడుపుతాను అని చెబుతాడు. ఒక బిజినెస్ మేన్ .. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి చేస్తాడో ఆలోచన కూడా చేయలేని మనుషులు చాలా మంది ఉన్నారు.. చివరకీ ఫిజికల్ ఛాలెంజ్ మనుషులు కూడా అనుకుంటే డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు అనుకుంటే డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదంటూ పెద్ద లెక్చరే ఇచ్చాడు. మొత్తంగా నాగబాబు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. పైసామే పరమాత్మ.. అన్నట్టు డబ్బుకు దాసోహం కావొద్దు. దాన్ని గౌరవించాలని చెప్పడం నాగబాబు ఉన్నది ఉన్నట్టు నాగబాబు కుండబద్దలు కొట్టాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 3, 2020, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading