NAGABABU REVEALS ABOUT PAWAN KALYAN KRISH MOVIE TA
పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా కథను లీక్ చేసిన నాగబాబు..
పవన్ కళ్యాణ్, నాగబాబు
పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా కథపై నాగబాబు స్పందించాడు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అందరు నటీనటులు ఇంట్లోనే ఉన్నారు. దీంతో నాగబాబు.. అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చాట్ చేసారు.
పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా కథపై నాగబాబు స్పందించాడు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అందరు నటీనటులు ఇంట్లోనే ఉన్నారు. దీంతో నాగబాబు.. అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చాట్ చేసారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాపై స్పందించారు. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మొగలాయిల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతోందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ స్టోరీ కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాదు అప్పటి తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒక యోధుని కథ అని చెప్పుకొచ్చారు. అతను మొగలాయిలపై తిరుగుబాటు చేసిన కథాంశంతో తెరకెక్కుతోంది అన్నారు.ఈ సినిమా టైటిల్ ఏంటో తనకు తెలియదన్నారు. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
పవన్, క్రిష్ సినిమాపై నాగబాబు స్పందన (File/Photo)
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాతో పాటు ‘వకీల్ సాబ్’ సినిమా చేసాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమా ఆగష్టుకు పోస్ట్‌పోన్ చేసే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్‌సాబ్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా హిందీలో అమితాబ్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, డాలీ, బాబీ సినిమాలను లైన్లో పెట్టాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.