నిహారిక, చైతన్య ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేసిన నాగబాబు..

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం వెంకట చైతన్య జొన్నలగడ్డతో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. తాజాగా ఈ వేడుకు సంబంధించిన వీడియోను నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసారు.

news18-telugu
Updated: August 15, 2020, 1:22 PM IST
నిహారిక, చైతన్య ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేసిన నాగబాబు..
నిహారిక నిశ్చితార్థం (niharika engagement)
  • Share this:
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా  ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. తాజాగా మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం వెంకట చైతన్య జొన్నలగడ్డతో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ ఎంగేజ్మెంట్‌కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నిహారిక, చైతన్య వివాహా నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలతో కూడిని వీడియోను నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసారు.

ఈ వీడియోలో నిహారిక నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలతో వీడియో రూపొందించారు. నిహారిక వివాహాం విషయానికొస్తే.. తాంబూలాలు పూర్తి కావడంతో ఇపుడు పెళ్లి డేట్ ఎపుడేదనేది త్వరలోనే  అఫీషియల్‌గా  ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే కార్తీకం కానీ లేదా మార్గశిర మాసం అంటే అక్టోబర్, నవంబర్‌లో నిహారిక, చైతన్య పెళ్లి జరిగే అవకాశాలున్నాయని  మెగాకుటుంబ సభ్యులు చెబుతున్నారు.వెంకట చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. ఈయన  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు.  ప్రస్తుతం.. ఈయన పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎంగేజ్మెంట్‌లో చైతన్య హడావుడి చూస్తుంటే.. ఇతను కూడా త్వరలో వెండితెరపై హీరోగా ప్రత్యక్షమైన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 15, 2020, 1:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading