Jabardasth-Nagababu: జబర్ధస్త్‌లో రీ-ఎంట్రీపై కుండబద్ధలు కొట్టిన నాగబాబు.. నిర్ణయం తీసుకోవాల్సిందే వారే..

నాగబాబు, రోజా (ఫైల్ ఫోటో)

Nagababu on Jabardasth Re Entry: నాగబాబు వెళ్లిపోవడం వల్ల ఖాళీ అయిన జడ్జి స్థానాన్ని భర్తీ చేయడానికి షో మేనేజ్‌మెంట్ బాగానే కష్టపడింది. ప్రస్తుతం నాగబాబు స్థానంలో జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఈ సీటులో సెటిలైపోయినట్టు కనిపిస్తోంది.

  • Share this:
    మెగాబ్రదర్ నాగబాబు జబర్ధస్త్‌ షో జడ్జిగా వ్యవహరించి తన పాపులారిటీని పెంచుకోవడంతో పాటు షో క్రేజ్‌ను పెంచడంతో కీలక పాత్ర పోషించారనే విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల క్రితం ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఇతర ఛానల్‌లో టెలికాస్ట్ అయిన ఇలాంటి ఓ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించారు. అయితే కొన్ని ఇతరాత్రా కారణాల వల్ల ఆ షో ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ నాగబాబు (Nagababu) జబర్ధస్త్ షోకు రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని గతంలో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

    తాను జబర్ధస్త్ (Jabardasth) నుంచి తాను బయటకు వెళ్లిపోవడానికి కొన్ని ఇతర కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ తాను జబర్ధస్త్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నానని అన్నారు. అయితే అది మల్లెమాల సంస్థ, ఈటీవీ యాజమాన్యం తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్లు ఒప్పుకుంటే మళ్లీ తాను జబర్ధస్త్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని నాగబాబు స్పష్టం చేశారు. దీంతో నాగబాబుకు మళ్లీ జబర్ధస్త్‌లోకి రావడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టమవుతోంది.

    అయితే నాగబాబు వెళ్లిపోవడం వల్ల ఖాళీ అయిన జడ్జి స్థానాన్ని భర్తీ చేయడానికి షో మేనేజ్‌మెంట్ బాగానే కష్టపడింది. ఎంతోమంది ఈ సీటులోకి వచ్చారు. కానీ వారిలో చాలామంది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం నాగబాబు స్థానంలో జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో (Singer Mano) ఈ సీటులో సెటిలైపోయినట్టు కనిపిస్తోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    మనో కూడా కామెడీలో మంచి టైమింగ్‌ను ప్రదర్శిస్తుండటంతో.. కొన్ని నెలల నుంచి రోజాతో పాటు సింగర్‌ మనోను ఈ షోకు జడ్జిగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పటికప్పుడు నాగబాబు ఈ షోకు రావాలని అనుకున్నా.. సింగర్ మనో కారణంగా ఆ స్థానం ఖాళీగా లేదని అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: