Home /News /movies /

NAGABABU REACTION ON MAA ELECTIONS AND COUNTER TO BALAKRISHNA COMMENTS AK

Nagababu Comments: బాలకృష్ణకు నాగబాబు కౌంటర్.. ఎవరైనా వెళ్లి అకౌంట్స్ చూసుకోవచ్చని కామెంట్

బాలకృష్ణ, నాగబాబు (ఫైల్ ఫోటో)

బాలకృష్ణ, నాగబాబు (ఫైల్ ఫోటో)

Nagababu Comments: మా అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఉండాలన్న నాగబాబు.. ప్రకాశ్ రాజ్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని.. ప్రకాశ్ రాజ్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు.

    ‘మా’ అసోసియేషన్ అనేది ఒక వైట్ పేపర్ లాంటిదని నటుడు నాగబాబు అన్నారు. ఎవరైనా వెళ్లి మా అకౌంట్స్ అడగవచ్చని వ్యాఖ్యానించారు. మా ఎన్నికలు ఏకగ్రీవం కావాలనే ప్రతిపాదనను నాగబాబు వ్యతిరేకించారు. ఏకగ్రీవం అనేది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని అన్నారు. రౌడీయిజం, బెదిరింపులు ఉంటేనే ఏకగ్రీవాలు అవుతాయని కామెంట్ చేశారు. మా సొంత భవనం అంశంపై నాగబాబు స్పందించారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను ఎకరం భూమి ఇవ్వాలని మురళీమోహన్ కోరారని నాగబాబు గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోవడం వల్ల భవనం కట్టలేకపోయారని అన్నారు. మా భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.

    వివిధ కారణాల వల్ల మా భవన నిర్మాణ విషయం మరుగునపడిందని నాగబాబు అన్నారు. బిల్డింగ్ కట్టేందుకు స్థలం ఎలా సేకరిస్తారో విష్ణు చెప్పాలని సూచించారు. మా అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఉండాలన్న నాగబాబు.. ప్రకాశ్ రాజ్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని.. ప్రకాశ్ రాజ్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు. మా అసోసియేషన్ ప్రతిష్ట మసకబారిందని తానే అన్నానని నాగబాబు తెలిపారు. లోకల్.. నాన్ లోకల్ అని నరేశ్, మంచు విష్ణు అనలేదని తెలిపారు.

    కుసంస్కారులు మాట్లాడిన వాటిని పట్టించుకోవద్దని అన్నారు. మా గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివే అని.. మోహన్ బాబు, మేమంతా కలిసే ఉంటామని నాగబాబు వ్యాఖ్యానించారు. విష్ణు గెలిచినా.. ప్రకాశ్ రాజ్ గెలిచినా కలిసే పని చేస్తామని అన్నారు. మాలో తెలంగాణ, ఆంధ్రా ఆర్టిస్టులు అనే భేదాలు లేవని నాగబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్‌కు ఉన్న వంద తలనొప్పుల్లో సినీ ఇండస్ట్రీ గురించి దృష్టి సారిస్తారని అనుకోవడం లేదని చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Nagababu, Nandamuri balakrishna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు