గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లోని తన నివాసం లో మొక్కలు నాటిన సినీ నటుడు నాగబాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. జబర్దస్త్ చమ్మక్ చంద్ర విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన సినీ నటుడు నాగబాబు. అనంతరం మరో ఇద్దరికి ఛాలెంజ్ విసిరాడు. బుల్లితెర నటుడు భరణి , ఆర్టిస్ట్ కాళికి రాజులు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నాగబాబు Photo : Twitter
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.