నాగబాబు సొంత రియాల్టీ కామెడీ షో ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..

నాగబాబు (File/Photo)

మెగా బ్రదర్ నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా అంతగా సక్సెస్ సాధించలేకపోయినా.. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన నిర్వహించబోయే స్టాండప్ కామెడీ ఎప్పటి నుంచో ప్రసారం కానుందో తెలిపాడు.

 • Share this:
  మెగా బ్రదర్ నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా అంతగా సక్సెస్ సాధించలేకపోయినా.. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్న జబర్ధస్త్ ప్రోగ్రామ్ నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల నాగబాబు పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత జీ తెలుగులో ‘అదిరింది’ వంటి కామెడీ షో మొదలు పెట్టాడు. ఐతే.. లాక్‌డౌన్ కారణంగా మెగా బ్రదర్ నాగబాబు  బిజీ అయిపోయాడు. కరోనా వైరస్ కారణంగా చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉండి తన ఛానెల్‌లో వరస వీడియోలు చేసిన నాగబాబు ఇప్పుడు మరోసారి బిజీ అయిపోయాడు. అదిరింది లాంటి షోకు జడ్జిగా ఉంటూనే.. మరోవైపు కొత్త షోలు మొదలు పెట్టడానికి ఆలోచిస్తున్నాడు నాగబాబు. దీనికి సంబంధించిన ప్రకటనలు కూడా చేసాడు. తాజాగా తను రూపొందించే బోయే కామెడీ షోకు విజిల్ అనే పేరు పెట్టాడు. ప్రీ లోడెడ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. తెలుగులో తొలి స్టాండప్ కామెడీ అని నాగబాబు చెప్పుకొచ్చాడు.


  ఈ షోను ఆగష్టు 15 నుంచి అల్లు అరవింద్‌కు చెందిన ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్నట్టు తన ట్విట్టర్‌లో తెలియజేసాడు. అంతేకాదు జబర్దస్త్‌, అదిరింది ప్రోగ్రామ్‌లాగా  ఇందులో కూడా కొత్త టీమ్ లీడర్స్ ఉండబోతున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్లు  ముగ్గురు తక్కువ కాకుండా తమ టీమ్ మెంబర్స్‌తో  రెండు స్కిట్స్‌ను చేసి vijilpreloaded@gmail.com కు మెయిల్ చేయాలని తెలిపారు. ప్రోగ్రామ్‌‌కు సంబంధించిన ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే.. 7013595747 నెంబర్‌కు పోన్ చేయమని కూడా ఇచ్చారు. ఇందులో టాప్ 20లో నిలిచిన వాళ్లకు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మరోవైపు టాప్ 6లో నిలిచిన వాళ్లకు మెగా క్యాష్ ప్రైజ్, నెంబర్ వన్‌గా నిలిచిన వాళ్లకు విజిల్ చాంపియన్‌గా ప్రకటిస్తామని నాగబాబు తన ట్విట్టర్‌లోని పాంప్లెట్‌‌లో పేర్కొన్నాడు.

  నాగబాబు కొత్త ప్రోగ్రామ్ విజిల్ (Twitter/Photo)


  మరి కమెడియన్‌లుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు ఇది నిజంగానే బంగారం లాంటి అవకాశం. మరెందుకు ఆలస్యం నాగబాబు ఇచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకునే ఆ కమెడియన్స్ ఎక్కడున్నారో చూడాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: