లోకల్ గ్యాంగ్ ప్రొమో వచ్చేసింది... నాగబాబు ఎంట్రీ అదిరింది

మెగా బ్రదర్ నాగబాబు (Facebook/Photo)

చాలా ఇంట్రస్టింగ్ టాపిక్స్‌తో వచ్చిన జీ తెలుగు ‘లోకల్ గ్యాంగ్ ’ ప్రొమో ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Share this:
    జబర్దస్త్ షోకు ఇన్నాళ్లు జడ్జీగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు.. మరో షోలో మెరిశారు. ఇవాల్టీ నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్న ’లోకల్ గ్యాంగ్’ లో ఇక నుంచి ఆయన కనపించనున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రొమో జీ తెలుగు ఛానల్ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. ఈ ప్రొమోలో యాంకర్ అనసూయ, ప్రదీప్, రవి, శేఖర్ మాస్టర్, మెగా బ్రదర్ నాగబాబు కనిపించారు. శేఖర్ మాస్టర్, అనసూయ తమ డాన్స్‌తో అదరగొట్టారు. ఇక రవి, ప్రదీప్ తమ యాంకరింగ్ ఫెరఫామెన్స్ చూపించారు. నాగబాబు ఎంట్రీ అదిరిపోయింది. నాగబాబు స్టేజ్‌పైకి రాగానే.. అక్కడున్న యూత్ అంతా ఈలలు వేసి గోలలు చేశారు. ఇక ఈ ప్రొమోలో కాలేజీ లైఫ్, లవ్ స్టోరీలు గురించి ప్రదీప్ మనకు కనిపించాడు. నాగబాబు లవ్ స్టోరీ గురంచి అడిగాడు. దీంతో ఆయన తన లైఫ్‌లో అన్నీ వన్ సైడ్ లవ్ స్టోరీలే అంటూ చెబుతూ అందర్నీ నవ్వించారు. ఏనాడు కాలేజీకి సరిగా వెళ్లలేదన్నారు. చాలా ఇంట్రస్టింగ్ టాపిక్స్‌తో వచ్చిన జీ తెలుగు ‘లోకల్ గ్యాంగ్ ’ ప్రొమో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ ప్రొగ్రామ్ ఎంతవరకు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి.

    First published: