జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు పోటీగా నాగబాబు సొంత కుంపటి..

నాగబాబు (Nagababu)

మెగా బ్రదర్ నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా అంతగా సక్సెస్ సాధించలేకపోయినా.. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన..

 • Share this:
  మెగా బ్రదర్ నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా అంతగా సక్సెస్ సాధించలేకపోయినా.. జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎంతో సాఫీగా సాగిపోతున్న జబర్ధస్త్ ప్రోగ్రామ్ నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల నాగబాబు పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత జీ తెలుగులో ‘అదిరింది’ వంటి కామెడీ షో మొదలు పెట్టాడు. తాజాగా ఇపుడు నాగబాబు తనే సొంతంగా ఓ కామెడీ షోను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అది కూడా తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేస్తాడట. అయితే వేదికగా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నాడట. ఈ షో ఇతర ఛానెల్‌లో ఎక్కడ ప్రసారం కాదు. కేవలం నాగబాబుకు చెందిన యూట్యూబ్‌ ఛానెల్‌ ‘మన ఛానెల్ మన ఇష్టం’తో  మాత్రమే ప్రసారం అవుతుందట. ఇప్పటికే జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు టీవీలో ప్రసారమయ్యేటపుడు వచ్చే టీఆర్పీలతో పాటు యూట్యూబ్ వ్యూస్‌తో అదనపు ఆదాయం వస్తోంది. యూట్యూబ్‌లో యాడ్స్ ద్వారా ఈ మధ్యకాలంలో చాలా మంది బాగానే ఆదాయం ఆర్జిస్తున్నారు. జబర్ధస్త్, అదిరింది షో మాదరిగానే ఇందులో కూడా కొత్త టీమ్ లీడర్స్ ఉండబోతున్నట్టు సమాచారం.

  నాగబాబు (Nagababu)
  నాగబాబు (Nagababu)


  ఇందులో గతంలో ప్రేక్షకులకు తెలిసిన మొఖాలతో పాటు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తాడట నాగబాబు. అంతేకాదు ఎవరైనా కామెడీ టాలెంట్ ఉంటే తమకు సంబంధించిన స్కిట్‌ను ఫోన్‌లో రికార్డు చేసుకుని పంపిస్తే.. అది చూసి ఈ ప్రోగ్రామ్‌లో కామెడీ చేయడానిక అవకాశం కల్పిస్తారట. మరి ఈ షోకు నాగబాబు యాంకర్‌గా పాల్గొంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ నాగబాబు యాంకరింగ్ లేకపోతే.. ఈ కామెడీ షోకు అంత జోష్ ఉండదు. కాబట్టి నాగబాబు తన సొంత యూట్యూబ్‌ ఛానెల్‌లో వేరే వాళ్లతో యాంకరింగ్ చేయించే సాహసం చేయకపోవచ్చు. అసలు నాగబాబు అంటేనే ఓ బ్రాండ్. అందుకే ఆయనే ఈ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. నాగబాబు యూట్యూబ్ ప్రోగ్రామ్ ద్వారా కొత్త టాలెంట్‌కు అవకాశాలు దక్కి, ప్రోగ్రామ్ సక్సెస్ అయితే.. ఇతర ఛానెల్స్‌ లలో కూడా ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: