Home /News /movies /

NAGABABU MEGA BROTHER IS MY GOD SAYS SENIOR HEROINE JAYALALITA IN ALI THO SARADAGA TA

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు నా దైవం అంటున్న హీరోయిన్..

నాగబాబు (Instagram/Photo)

నాగబాబు (Instagram/Photo)

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు నా దైవం అంటోంది. సీనియర్ హీరోయిన్. తనకు ఎపుడు ఏ కష్టం వచ్చిన తనకు చెబితే.. ఆత్మీయుడిలా చేతనైనా సాయం చేస్తాడంటూ చెప్పుకొచ్చింది సదరు సీనియర్ నటి. వివరాల్లోకి వెళితే..

    Nagababu: మెగా బ్రదర్ నాగబాబు నా దైవం అంటోంది. సీనియర్ హీరోయిన్. తనకు ఎపుడు ఏ కష్టం వచ్చిన తనకు చెబితే.. ఆత్మీయుడిలా చేతనైనా సాయం చేస్తాడంటూ చెప్పుకొచ్చింది సదరు సీనియర్ నటి. వివరాల్లోకి వెళితే.. ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో ప్రతీవారం ఎవరో సెలబ్రిటీ ముఖ్య అతిథిగా పిలవడం ఎప్పటి నుంచో ఉంది. గత కొన్నేళ్లుగా  ఈ ప్రోగ్రామ్‌లో ఇద్దరేసి చొప్పున సెలబ్రిటీలు హాజరవుతున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో అలనాటి హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితతో పాటు ఒకప్పటి హీరోలకు చెల్లెలు పాత్రతో ఫేమస్ అయిన వరలక్ష్మి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒకప్పుడు హీరోయిన్‌గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వ్యాంప్‌గా చేసిన జయలలిత.. తనను ఓ ప్రొడ్యూసర్ దాదాపు రూ. 6 కోట్లకు మోసం చేసిన విషయాన్ని ప్రస్తావించి కన్నీరు పెట్టుకుంది. తనను ఇండస్ట్రీలో బోరింగ్ పాపగా గుర్తు పడతారనే విషయాన్ని గుర్తు చేసుకుంది.  అంతేకాదు తనను ఎంతో మంది డబ్బుల విషయంలో మోసం చేశారంది. తాను ఏ హీరోయిన్‌గా పాపులర్ కాకపోవడానికి కారణం తన తలరాతే అని చెప్పుకొచ్చింది. తాను విధిని బలీయంగా నమ్ముతానని చెప్పింది.

    Nagababu Mega Brother Is My god Says Senior Heroine Jayalalita in Ali Tho Saradaga,Nagababu: మెగా బ్రదర్ నాగబాబు నా దైవం అంటున్న హీరోయిన్..,Nagababu,Jayalalitha,Jayalalitha Ali Tho saradaga,Jayalalitha Interview,vara lakshmi Interview,Tollywood,Telugu Cinema,jayalalitha movies,jayalalitha songs,జయలలిత,జయలలిత ఇంటర్వ్యూ,జయలలిత నాగబాబు.నాగబాబు గురించి జయలలిత ఎమోషనల్,ఎమోషనల్ అయిన జయలలిత,నాగబాబు పై  జయలలిత ఎమోషనల్ కామెంట్స్
    జయలలిత (ETV Courtesy/Youtube Credit)


    ఇక సినీ ఇండస్ట్రీలో తనకు ఎపుడు కష్టాల్లో ఉన్న మెగా బ్రదర్ నాగబాబు తనను ఆర్ధికంగా ఆదుకుంటారని చెప్పకొచ్చింది. ఈ సందర్బంగా ఈ ప్రోగ్రామ్‌లో నాగబాబు.. జయలలిత టాలెంట్‌ను ఆకాశానికి ఎత్తేసారు. కొంత మంది ఎంత టాలెంట్ ఉన్న.. పిసరంత అదృష్టం కూడా ఉండాలన్నారు. ఆ చిటికెడంత అదృష్టం లేని వాళ్లలో జయలలిత ఒకరు. ఆమె టాలెంట్‌కు ఆమె ఎక్కడో ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. మరోవైపు జయలలిత తనకు పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన గోపాలకృష్ణ.. తనకు వీడియో కాల్ చేసి తన యోగ క్షేమాలు అడుగుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. అప్పట్లో రామానాయుడు గారు ఆయన సినిమాల్లో తనకు పిలిచి మరి వేషం ఇచ్చే వారన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది నటి జయలలిత.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jayalalitha, Nagababu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు