NAGABABU MASTER PLAN IN ADIRINDI TO BEAT JABARDASTH COMEDY SHOW WITH THE CHANGE OF ANCHORS PK
జబర్దస్త్ కామెడీ షోను కొట్టాలని నాగబాబు మాస్టర్ ప్లాన్..
నాగబాబు (Nagababu)
Jabardasth Comedy Show: కొన్ని నెలల కింద జీ తెలుగులో మాత్రం అదిరింది అంటూ జబర్దస్త్ కామెడీ షో పోటీగా పెట్టారు. ఈ షో పెట్టి కూడా మూడు నెలలు అయిపోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు రేటింగ్స్ మాత్రం ఊహించిన విధంగా రాలేదు.
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రేటింగ్స్ పరంగా రికార్డులు తిరగరాసింది ఈ షో. ఇప్పటికీ తిరగరాస్తూనే ఉంది. ఈ షోను కొట్టాలని ఇప్పటికే చాలా మంది కామెడీ షోలు పెట్టి చేతకాక దుకాణం సర్దేసారు. అయితే కొన్ని నెలల కింద జీ తెలుగులో మాత్రం అదిరింది అంటూ జబర్దస్త్ కామెడీ షో పోటీగా పెట్టారు. ఈ షో పెట్టి కూడా మూడు నెలలు అయిపోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు రేటింగ్స్ మాత్రం ఊహించిన విధంగా రాలేదు. దాంతో జీ తెలుగు టీం చాలా ప్లాన్స్ వేస్తుంది. ముఖ్యంగా అంతా జబర్దస్త్ ఫార్మాట్లోనే ఈ షో కూడా సాగుతుంది. అక్కడ ఎలాగైతే అనసూయ, రష్మి అందాలు ఆరబోస్తున్నారో ఇక్కడ కూడా సమీరా అనే అమ్మాయిని తీసుకొచ్చారు.
అయితే ఫామ్‌లో లేని ఈ బ్యూటీతో అదిరిందికి అస్సలు కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు ఆమెను తప్పించేసారు నిర్వాహకులు. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో మరో ఇద్దరు కొత్త యాంకర్స్ వచ్చారు. జబర్దస్త్ స్కిట్స్‌ను పూర్తిగా కాపీ చేస్తూ అక్కడ చేసినట్లుగానే ఇక్కడ కూడా టీం లీడర్స్ కామెడీ చేసారు. అయితే అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దానికితోడు మసాలా కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అదిరింది షోలో. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీనికి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే యాంకర్ సమీరాపై వేణు, చంద్ర, ధనరాజ్, ఆర్పీ లాంటి వాళ్లు వేసే డబుల్ మీనింగ్ డైలాగులు కూడా విమర్శలు అందుకుంటున్నాయి.
నాగబాబు (Nagababu)
ఇలాంటి తరుణంలో సమీరాను కాదని షోలోకి రవి, భాను శ్రీ లాంటి కొత్త యాంకర్స్‌ను తీసుకొచ్చారు. బిగ్ బాస్ సహా కొన్ని సినిమాలతో కూడా ఇప్పటికే భాను శ్రీ గుర్తింపు తెచ్చుకుంది. దాంతో పాటు అందాల ఆరబోతలో కూడా అమ్మడికి ఎక్కడా అడ్డు కూడా లేదు. అందుకే రెచ్చిపోవాలని చూస్తుంది భాను. దాంతో పాటు రవికి కూడా యాంకరింగ్‌లో మంచి ఇమేజ్ ఉంది. ఈ ఇద్దరి ఇమేజ్‌తో అదిరింది రేటింగ్స్ పెంచాలని చూస్తున్నారు నిర్వాహకులు. ఈ యాంకర్ మార్పులో నాగబాబు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. ఏదేమైనా కూడా కచ్చితంగా జబర్దస్త్ కామెడీ షోను కొట్టాలనేది అదిరింది టీం వేస్తున్న ప్లాన్. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.