Nagababu: నాగబాబుకు త్వరలో కేంద్రంలో కీలక పదవి.. అందుకే ప్రోగ్రామ్‌లు తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

నాగబాబు (Youtube/Credit)

Nagababu: మెగా బ్రదర్ నాగబాబుకు త్వరలో కేంద్రంలో కీలక పదవి వరించనుందా అంటే ఔననే అంటున్నాయి బిజేపీ - జనసేన వర్గాలు.

 • Share this:
  Nagababu: మెగా బ్రదర్ నాగబాబుకు త్వరలో కేంద్రంలో కీలక పదవి వరించనుందా అంటే ఔననే అంటున్నాయి బిజేపీ - జనసేన వర్గాలు. అందుకే ఇపుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నాగబాబు విషయానికొస్తే.. నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్ కామెడీ షోతో పాటు అదిరింది వంటి ప్రోగ్రామ్స్‌తో ఎంతోమందికి చేరువయ్యారు.నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసిరాదు. ఆ తర్వాత అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..పలు చిత్రాలను నిర్మించారు.

  ఆ తర్వాత జబర్ధస్త్ వంటి కామెడీ షో జడ్జ్‌గా ఉంటూనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి నిలదొక్కున్నాడు.  ఇక తనకు ఎంతో పాపులారిటీ తీసుకొచ్చిన జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పి ఆ తర్వాత వేరే చానెల్స్ ‘అదిరింది’ వంటి ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సొంతంగా  ‘విజిల్’ అంటూ స్టాండప్ కామెడీ షోను స్టార్ట్ చేసినా.. పెద్దగా సక్సెస్ సాధించలేదు.

  అవును మెగా బ్రదర్స్ .. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసిన ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు.
  మెగా బ్రదర్స్ చిరంజీవి,నాగబాబు,పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


  సినిమాలు, టీవీ ప్రోగ్రాములు పక్కనపెడితే.. నాగబాబు.. మొన్నటి 2019 ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన తరుపున ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాడు. అంతేకాదు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసారు. ఐతే.. ఆ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ సహా నాగబాబు ఓడిపోయారు. ఐతే.. పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు. ఇక నాగబాబు మాత్రం ప్రస్తుతం రాజకీయాలను పక్కనపెట్టి టీవీ ప్రోగ్రామ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. ఐతే.. నాగబాబు క్రియాశీల రాజకీయాల్లో బిజీ కావాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటకీ జనసేనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంది.

  Will Nagababu sacrifices his Jabardasth career for his Brother Pawan Kalyan and Janasena Party future pk ఏమో ఇప్పుడు ఇదే వార్తలే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నిజంగానే నాగబాబు తన తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన జబర్దస్త్ కెరీర్ కూడా దీనికోసమే పణంగా పెట్టారని టాక్ వినిపిస్తుంది. naga babu,naga babu political future,naga babu jabardasth comedy show,naga babu extra jabardasth comedy show,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,nagababu,ys jagan mohan reddy,nagababu ap cm ys jagan mohan reddy,jabardasth comedy show,jabardasth nagababu,nagababu pawan kalyan janasena,pawan kalyan,ap assembly elections 2019,ap news,ap elections,ap politics,janasena party,janasena,జనసేన అధినేత,పవన్ కల్యాణ్,జనసేన పార్టీ,నాగబాబు,పవన్ కల్యాణ్ ఓటమి,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్,జనసేన,వైయస్ జగన్ మోహన్ రెడ్డి,వైయ్ జగన్ నాగబాబు,పవన్ కళ్యాణ్ నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,
  పవన్ కళ్యాణ్ నాగబాబు ఫైల్ ఫోటో (Source: Twitter)


  ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా.. బీజేపీకి సపోర్ట్‌ చేస్తోంది. దీనికి ప్రతి ఫలంగా వచ్చే టర్న్‌లో ఖాళీ అయ్యే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ , జనసేన పొత్తులో భాగంగా ఓ రాజ్యసభ సీటు జనసేనకు కేటాయించాలనేది జనసేన షరతు పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా జనసేన తరుపున రాజ్యసభకు అన్నయ్య నాగబాబును పంపించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం. ఈ రకంగా రాజ్యసభలో అన్నయ్య నాగబాబు ద్వారా జనసేన వాణీ వినిపించాలనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇప్పటికే నాగబాబు.. రాజకీయాలతో పాటు సామాజిక సమస్యలపై మంచి అవగాహన ఉంది.  ఇప్పటికే పలు అంశాలపై ఎలాంటి మొహమాటం లేకుండా ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తుంటారు. అందుకే ఇక ముందు ఎలాంటి టీవీ కార్యక్రమాలు చేయకుండా.. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే కొనసాగాలనే నిర్ణయానికి నాగబాబు వచ్చినట్టు మెగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: