Home /News /movies /

NAGABABU LATEST COMEDY SHOW ADIRINDI ANCHOR SAMEERA GET GOOD CHANCES IN FUTUR AS LIKE JABARDASTH SHOW ANCHORS ANASUYA RASHMI TA

‘అదిరింది’ యాంకర్ సమీరా ఎవరు.. అనసూయ, రష్మీలకు పోటీ ఇస్తుందా..

యాంకర్స్ అనసూయ,రష్మీ గౌతమ్, అదిరింది యాంకర్ సమీరా (Youtube/Photos)

యాంకర్స్ అనసూయ,రష్మీ గౌతమ్, అదిరింది యాంకర్ సమీరా (Youtube/Photos)

జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా గుడ్ బై చెప్పిన తర్వాత నాగబాబు.. జీ తెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా ఆ ఆదివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌కు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరో జడ్జ్‌గా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఈ షోకు సమీరా యాంకర్‌గా వ్యవహరించారు.

ఇంకా చదవండి ...
    జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా గుడ్ బై చెప్పిన తర్వాత నాగబాబు.. జీ తెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా ఆ ఆదివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌కు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరో జడ్జ్‌గా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఈ షోకు సమీరా యాంకర్‌గా వ్యవహరించారు. ఇక మొన్ననే ప్రసారమయిన మొదటి ఎపిసోడ్‌తోనే సమీరాను అనసూయ, రష్మీ గౌతమ్‌లతో పోల్చడం భావ్యం కాదు. కానీ సమీరా.. పలు సీరియల్స్‌తో ఆమె కంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరుచుకున్న ప్రత్యేకంగా అనసూయ, రష్మీల మాస్ జనాలు గుర్తు పట్టేంత పాపులారిటీ మాత్రం ఇంకా సంపాదించలేదు. ఇక జబర్దస్త్ షో విషయానికొస్తే.. అప్పటి వరకు ఎవరికి అంతగా తెలియని అనసూయ, రష్మీ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాదు షోలో ప్రారంభంలో మొదలయ్యే పాటకు తమ గ్లామర్‌తో మరింత వన్నె తీసుకొచ్చారు. ఇక స్కిన్ షో ప్రదర్శించడంతో హీరోయిన్స్ కూడా వీళ్లకు సాటి రానంతగా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ షోతో వీళ్లు సినిమాల్లో హీరోయిన్స్‌గా నటించే అవకాశాలు కూడా దక్కించుకున్నారు. ఇక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో వీళ్లకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

    యాంకర్స్ అనసూయ,రష్మీ గౌతమ్, అదిరింది యాంకర్ సమీరా (Youtube/Photos)


    ఇక జీ తెలుగులో రీసెంట్‌గా ప్రసారమయిన ‘అదిరింది’ విషయానికొస్తే.. సమీరా యాంకరింగ్‌ను ప్రేక్షకులు అనసూయ, రష్మీలతో పోల్చి చూడటం కామన్. కానీ ఫస్ట్ ఎసిసోడ్‌తోనే సమీరా నుంచి అలాంటివి కోరుకోవడం తప్పనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ చూస్తుంటే సమీరా..గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవనే సంగతి స్పష్టమవుతోంది. భవిష్యత్తులో సమీరా అనసూయ,రష్మీలా తనకంటూ ఓన్ ఐడెంటిటీ ఏర్పరుచుకోవడంపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏమైనా ‘అదిరింది’ ప్రోగ్రామ్‌తో ఎంట్రీ ఇచ్చిన భామ.. ముందు ముందు స్మాల్ స్క్రీన్ పై ఎలా తన యాంకరింగ్‌తో అదరగొడుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adirindi comedy show, Anasuya Bharadwaj, Anchor sameera, Jabardasth comedy show, Nagababu, Rashmi Gautam, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు