బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దంటున్న కొణిదెల నాగ‌బాబు..

అదేంటి.. బాల‌య్య ఎవ‌రో తెలియ‌కుండా ఉంటుందా..? ఈ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణ తెలియ‌ని వారుంటారా..? మొన్న‌టికి మొన్న కేఏ పాల్ త‌న‌కు బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని కామెడీ చేసాడు. ఇప్పుడు ఇదే కామెడీ నాగ‌బాబు కూడా చేసాడు. ఈయ‌న‌కు నిజంగానే బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 9, 2018, 12:30 PM IST
బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దంటున్న కొణిదెల నాగ‌బాబు..
నాగబాబు బాలయ్య
  • Share this:
అదేంటి.. బాల‌య్య ఎవ‌రో తెలియ‌కుండా ఉంటుందా..? ఈ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణ తెలియ‌ని వారుంటారా..? మొన్న‌టికి మొన్న కేఏ పాల్ త‌న‌కు బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని కామెడీ చేసాడు. ఇప్పుడు ఇదే కామెడీ నాగ‌బాబు కూడా చేసాడు. ఈయ‌న‌కు నిజంగానే బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు. కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి.. జ‌న‌సేన‌కు మ‌ధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దాంతో ఇప్పుడు నాగబాబును ఈ విష‌యం గురించి ప్ర‌శ్న అడిగారు మీడియా మిత్రులు. దానికి నాగ‌బాబు కూడా ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధానం చెప్పాడు. త‌న‌కు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పాడు.

Nagababu Konidela Interesting comments on Nandamuri Balakrishna.. అదేంటి.. బాల‌య్య ఎవ‌రో తెలియ‌కుండా ఉంటుందా..? ఈ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణ తెలియ‌ని వారుంటారా..? మొన్న‌టికి మొన్న కేఏ పాల్ త‌న‌కు బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని కామెడీ చేసాడు. ఇప్పుడు ఇదే కామెడీ నాగ‌బాబు కూడా చేసాడు. ఈయ‌న‌కు నిజంగానే బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు. nandamuri balakrishna,nandamuri balakrishna nagababu,nagababu balakrishna,telugu cinema,nagababu balayya,nandamuri balayya,pawan kalyan janasena,నాగబాబు బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ నందమూరి నాగబాబు,నాగబాబు సంచలన వ్యాఖ్యలు,బాలకృష్ణ నందమూరిపై నాగబాబు కమెంట్స్,తెలుగుదేశం జనసేన,తెలుగు సినిమా
నాగబాబు ఫైల్ ఫోటో


బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు, ఐయామ్ సారీ, నేను ఈ విష‌యం గురించి మాట్లాడనని చెప్పి ఆస‌క్తి సృష్టించాడు. బాల‌య్య తెలియ‌ద‌ని చెబితే బాగున్ను కానీ అక్క‌డితో ఆగ‌కుండా బాల‌య్య వ‌య‌సుపై కూడా సెటైర్లు వేసాడు ఈ సీనియ‌ర్ న‌టుడు. బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పాను క‌దా.. సారీ సారీ తెలుసు.. ఆయ‌న గురించి నాకు తెలుసు.. బాలయ్య చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్ నటుడు. అప్పట్లో నేరము-శిక్ష లాంటి సినిమాల్లో కృష్ణ, బాలయ్య కలిసి న‌టించారంటూ చెప్పాడు. ఆ బాల‌య్య కాదండి.. ఇప్పుడు మేం అడుగుతున్న‌ది నందమూరి బాలకృష్ణ గురించి అని మీడియా వాళ్లు అడిగితే.. ఆ త‌రం బాల‌య్య తెలుసు కానీ ఈ త‌రంలో ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు నాగబాబు.


రాజకీయంగా త‌న త‌మ్ముడు జ‌న‌సేన పార్టీకి.. తెలుగుదేశంకు మ‌ధ్య వార్ న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో నాగ‌బాబు ఇలా మాట్లాడ‌టం ఆస‌క్తి పుట్టిస్తుంది. బాల‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పి ఇప్పుడు పార్టీ నేతల ఇగోపై దెబ్బ‌కొట్టాడు నాగ‌బాబు. త‌న‌కు జనసేన పార్టీలో ఓ నాయకుడిగా కంటే సామాన్య కార్యకర్తలా పనిచేయడం తనకు ఇష్టమని తెలిపాడు. మొత్తానికి ఇప్పుడు నాగ‌బాబు చెప్పిన మాట‌లు అటు తెలుగుదేశం వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
First published: December 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>