అలాంటి వాళ్ల భరతం పట్టాలన్న నాగబాబు..ఎమోషనల్ అయిన మెగా బ్రదర్..

నాగబాబు (Twitter/nagababu)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తుల్లో నాగబాబు ఒకడు. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాగబాబు తన యూట్యూబ్‌లో కొంత మందిపై విరుచుపడ్డాడు.

  • Share this:
    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తుల్లో నాగబాబు ఒకడు. ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటాడు. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాగబాబు తన యూట్యూబ్‌లో కొంత మందిపై విరుచుపడ్డాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను హడలెత్తిస్తుంది. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. నివారణ చర్యల్లో భాగంగా ఓ వీడియోను రిలీజ్ చేసాడు. కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థలను చిన్నాభిన్నాం చేసింది. ఎన్నో దేశాల ఎకానమి కుదేలైంది ఈ మహమ్మారి దెబ్బకు. ఇప్పటికే మన దేశంలో కరోనా పీడితుల సంఖ్య వందల్లోకి చేరింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అందరు జనతా కర్వ్యూ విధించారు. ఈ జనతా కర్ఫ్యూకు పాటించిన దేశ ప్రజలకు నాగబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.  కరోనాకు కుల, మత, జాతి, పేద, గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరు జనతా కర్ఫ్యూలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు నాగబాబు. కరోనా పట్ల ఎవ్వరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇదే సమయంలో కొన్ని అనవరసర వార్తలను వ్యాప్తి చేసే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. 

    Published by:Kiran Kumar Thanjavur
    First published: