ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవ్గణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ మాట్లాడుతూ.. ఇటీవలె విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ ప్రొమో తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు. ఐతే.. ఎన్టీఆర్ పోషిస్తోన్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన ప్రోమో కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నాగబాబు.. రీసెంట్గా అభిమానులతో ఫేస్బుక్ లైవ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఫేస్బుక్ లైవ్లో సమాధానం చెప్పని కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసారు.
ఆర్ఆర్ఆర్ సినిమాపై నా అభిప్రాయాల గురించి రీసెంట్గా ఫేస్బుక్ లైవ్లో కొందరు నన్ను అడిగారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను చూసాను. ఆ వీడియో చూసాకా.. రామరాజు పాయింట్ ఆఫ్ వ్యూలో కొమరం భీమ్ పాత్ర ఉండబోతుందో అనే ఆతృత నాలో మొదలైంది అన్నారు. ఇప్పటికే రామరాజు పాత్రతో ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఇక కొమరం భీమ్ ప్రోమో విడుదలైతే ఇంకెన్ని అంచనాలు ఏర్పడుతాయో అని సినిమాపై తనకెంతో ఆసక్తి ఉందో వివరించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ పై నాగబాబు కామెంట్స్ (Twitter/Photo)
మెగా, నందమూరి వంటి మాస్ హీరోలతో రాజమౌళి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కథ కూడా ఇదే అయి ఉండవచ్చని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు పెట్టిన ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా టైటిల్ విషయానికొస్తే.. బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమా టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 13, 2020, 14:58 IST