Home /News /movies /

Varun Tej Marriage: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

Varun Tej Marriage: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

నాగబాబు, వరుణ్ తేజ్ (ఫైల్ పోటో)

నాగబాబు, వరుణ్ తేజ్ (ఫైల్ పోటో)

Varun Tej Marriage: టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే విషయంలో సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్.. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి తరువాత అందరి దృష్టి వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అనే అంశంపైనే నెలకొంది. నాగబాబు సైతం నిహారిక పెళ్లి అయిన తరువాత కుదిరితే సాధ్యమైనంత తొందరగానే వరుణ్ తేజ్ పెళ్లి చేస్తామని వ్యాఖ్యానించారు. టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే విషయంలో సక్సెస్ సాధించిన వరుణ్ తేజ్.. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలోని అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్లు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో.. వరుణ్ తేజ్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేక తన చెల్లెలిలా పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓకే చెబుతారా అనే చర్చ కూడా సాగుతోంది.

    అయితే దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడనే అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని నాగబాబు.. వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి చేసుకున్నా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే ఏ రకమైన పెళ్లి అయినా వరుణ్ తేజ్‌కి మంచి అమ్మాయి భార్యగా రావాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని నాగబాబు తెలిపారు.

    నిహారిక పెళ్లి తరువాత మెగా ఫ్యామిలీలో ఎవరి పెళ్లి జరుగుతుందనే దానిపై గతంలోనే జోరుగా చర్చ జరిగింది. కొందరు నెక్స్ట్ పెళ్లి సాయిధరమ్ తేజ్‌దే అని అన్నారు. అయితే తన కంటే అల్లు శిరీష్ పెద్దవాడని.. ముందు అతడి పెళ్లి జరుగుతుందని సాయిధరమ్ తేజ్ చెప్పడంతో.. ఈ ఏడాది అల్లు వారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగడం ఖాయమనే టాక్ మొదలైంది. అయితే దీనిపై స్పందించిన అల్లు శిరీష్.. తేజూ ఈ విషయంలో జోక్ చేశాడని ఈ మొత్తం చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు వ్యాఖ్యలు చేయడంతో మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ పెళ్లి వరుణ్ తేజ్‌దే అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Nagababu, Tollywood, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు