NAGABABU HOST ADIRINDI PROGRAMME ANCHOR SAMEERA SHARIF EXIT PROGRAMME TA
అందుకే 'అదిరింది' నుంచి నన్ను తప్పించారు.. యాంకర్ సమీరా వీడియో వైరల్..
సమీరా షరీఫ్ (Instagram/Photo)
నాగబాబు, సమీరా షెరిఫ్, చంద్ర, ఆర్.పి, ధనరాజ్, వేణు మొదలైన టీవీ కామెడి స్టార్స్ అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద వినోదాన్ని అందించే సరికొత్త షో "అదిరింది". ఈ నేపథ్యంలో దీనికి యాంకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న టీవీ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్‌ను పక్కన పెట్టేశారు షో నిర్వాహకులు.
నాగబాబు, సమీరా షెరిఫ్, చంద్ర, ఆర్.పి, ధనరాజ్, వేణు మొదలైన టీవీ కామెడి స్టార్స్ అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద వినోదాన్ని అందించే సరికొత్త షో "అదిరింది". స్మాల్ స్క్రీన్ కామెడి కింగ్ నాగబాబు జడ్జ్‌గా ఈ కొత్త షో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ కామెడీ షోకు సమీరా షరిఫ్ యాంకర్‌గా వ్యవరిస్తూ వచ్చింది. అయితే 'అదిరింది' షో ప్రారంభమై కేవలం పది వారాలు మాత్రమే అవుతోంది. జబర్ధస్త్‌కు పోటీగా మొదలైన ఈ షో.. టీఆర్పీ రేటింగ్‌లో దాన్ని అందుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో దీనికి యాంకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న టీవీ సీరియల్ హీరోయిన్ సమీరా షరీఫ్‌ను పక్కన పెట్టేశారు షో నిర్వాహకులు. పది వారాలకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.‘అదిరింది' షో నుంచి తప్పుకోవడం.. అదే సమయంలో తనపై వస్తున్న వార్తలు చూసిన సమీరా.. ఈ వ్యవహారంపై స్పందించింది.
ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ‘నేను షో నుంచి తప్పుకోలేదు. నాతో 26 ఎపిసోడ్స్‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లే నన్ను తీసేశారు. ఆ విషయం కూడా నాకు డైరెక్టుగా చెప్పలేదు' ఆ వీడియోలో పేర్కొంది. అదీ కాక నేను ప్రెగ్నెంట్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందుకే వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ కాదు.. వాళ్లే నన్ను తీసేశారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్' అని చెప్పుకొచ్చింది.అయితే సమీరాను పక్కన పెట్టిన అదిరింది బృందం. సమీర స్థానంలో ఈ షోలో రవి, భానుశ్రీ యాంకర్లుగా రంగ ప్రవేశం చేసారు. తాజాగా రవి, భానుశ్రీతో షూట్ చేసిన ప్రోమోను విడుదల చేశారు. అయితే సమీర షో నుంచి తప్పుకోవడంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ షో రేటింగ్స్ పెంచడానికే సమీరాను తప్పించి రవి, భానుశ్రీని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.