Ram Charan: టాలీవుడ్ మెగా బ్రదర్ నటుడు నాగబాబు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన వెండితెర లోనే కాకుండా బుల్లితెరలో కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరగా అయ్యారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈయన.. ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తూ, కాస్త వెటకారంతో పంచ్ లు విసురుతూ ముక్కుసూటి మనిషి గా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన చరణ్ కు ఓ సినిమాలో రెమ్యూనరేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదట.
తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా వరుస ఆఫర్లతో అవకాశాలను అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే స్టార్ హీరోగా నిలిచిన రామ్ చరణ్.. మొదట్లో ఈయన నటించిన చిరుత, ఆరెంజ్ సినిమాలు అంత గుర్తింపు ఇవ్వలేదు. ఇక ఆరెంజ్ సినిమా విషయానికొస్తే ఈ సినిమా ప్రేక్షకులనుండి విమర్శలను ఎదుర్కొంది. కానీ ఈ సినిమాలోని పాటలు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకి నిర్మాతగా నాగబాబు చేయగా.. ఈ సినిమా వల్ల అతి నమ్మకంతో ఎక్కువ పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలపాలయ్యారు.
దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా పారితోషకం ను రామ్ చరణ్ కు ఇవ్వకపోగా.. తాజాగా సోషల్ మీడియా ఖాతాలో నాగబాబు ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అనే చాలెంజ్ చేయగా అందులో ఓ నెటిజెన్ నాగబాబుని 'ఆరెంజ్ సినిమా ప్లాప్ తర్వాత చరణ్ మనీ' అని ప్రశ్నించగా.. వెంటనే నాగబాబు ' లేదు మా అన్నయ్య నా అప్పులు సగం తీర్చాడు. చరణ్ కు ఫ్యూచర్ లో మాత్రం రెమ్యూనరేషన్ ఇస్తా' అంటూ స్పందించాడు. దీనిని బట్టి రామ్ చరణ్ కు ఇప్పటివరకు నాగబాబు ఆరెంజ్ సినిమా పారితోషకాన్ని ఇవ్వలేదని తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Megastar Chiranjeevi, Nagababu, Orange film, Ram Charan