నాగబాబుకు సడెన్ షాక్...ఆ ఛానెల్‌ నుంచి ఔట్... అనసూయ కూడా హ్యాండిచ్చిందా...?

షో కాన్సెప్ట్ ప్రకారం తొలుతు నాగబాబు, అనసూయలను జడ్జిలుగా అనుకున్నారు. అయితే షో ప్రారంభం అయిన తర్వాత మాత్రం నాగబాబును కేవలం పార్ట్ టైమ్ యాంకర్ గా మార్చేసారనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 3, 2019, 7:59 PM IST
నాగబాబుకు సడెన్ షాక్...ఆ ఛానెల్‌ నుంచి ఔట్... అనసూయ కూడా హ్యాండిచ్చిందా...?
నాగబాబు, అనసూయ
  • Share this:
జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయి వేరు కుంపటి పెట్టుకున్ననాగబాబుకు అక్కడ కూడా షాక్ తగిలిందట. జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ పేరిట ప్రారంభమైన ప్రోగ్రాంలో తొలుత నాగబాబు, యాంకర్ అనసూయలే లీడ్ పర్సన్స్ షో ప్రారంభం అయ్యింది. అయితే ఈ షో కాన్సెప్ట్ ప్రకారం తొలుతు నాగబాబు, అనసూయలను జడ్జిలుగా అనుకున్నారు. అయితే షో ప్రారంభం అయిన తర్వాత మాత్రం నాగబాబును కేవలం పార్ట్ టైమ్ యాంకర్ గా మార్చేసారనే టాక్ వినిపిస్తోంది. అటు అనసూయ మాత్రం ఎంచక్కా తన జడ్జి సీటులో కూర్చొని షో నడిపించేస్తోంది. దీంతో నాగబాబుకు పెద్ద షాక్ తగిలిందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తొలుత నాగబాబు తనతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి పెద్ద తలకాయలను లాగి, మల్లెమాలకు షాక్ ఇవ్వాలని చూశాడు. అయితే నాగబాబుతో పాటు మరో జడ్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే రోజా మాత్రం జబర్దస్త్ తోనే తన ప్రయాణమని ప్రకటించింది. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ, నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వారంతా జతకట్టి లోకల్ గ్యాంగ్స్ కార్యక్రమానికి వెళ్లిపోతారని భావించారు. అయితే వారంతా సడెన్ గా తమ నిర్ణయం మార్చుకొని జబర్దస్త్ లోనే కొనసాగుతామని ప్రకటించేశారు. దీంతో నాగబాబుకి ఒక రకంగా షాక్ తగిలిందనే చెప్పాలి. అయితే వీరంతా జబర్దస్త్ వదిలివెళ్లకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రోజా చక్రం తిప్పారని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా గతంలో జబర్దస్త్ వీడిన ధనరాజ్, షకలక శంకర్, వేణు లాంటి వాళ్లకు బయట అటు సినిమాల్లోనూ, ఇటు బుల్లితెరపైనా పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. ఒకట్రెండు సినిమాల్లో హీరో అనిపించుకున్నప్పటికీ, వాళ్ల కెరీర్ లో అవేమీ పెద్ద మార్పులు తేలేదు. దీంతో జబర్దస్త్ లోనే కొనసాగితే బాగుండేదని, వారంతా భావించారని టాక్ వినిపిస్తోంది. అయితే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా జబర్దస్త్ వదిలి వెళితే వాళ్లలాగే అయిపోతామనే భయం ఉంది. ఆ మేరకు ఎమ్మెల్యే రోజా బ్రెయిన్ వాష్ చేసారని, దీంతో నాగబాబు వెంట నడవాలనుకున్న వారంతా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>