MLA రోజా రాజకీయాల వల్లే నాగబాబు జబర్ధస్త్ నుంచి తప్పుకున్నాడా..

నాగబాబు, రోజా Photo : Twitter

MLA Roja Nagababu |జబర్ధస్త్ ప్రోగ్రామ్ నుంచి నాగబాబు తప్పుకోవడానికి కారణం రోజానే కారణమా అంటే ఔననే అంటున్నాయి నాగబాబు సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    జబర్ధస్త్ ప్రోగ్రామ్ నుంచి నాగబాబు తప్పుకోవడానికి కారణం రోజానే కారణమా అంటే ఔననే అంటున్నాయి నాగబాబు సన్నిహిత వర్గాలు. అసలు జబర్ధస్త్ ప్రోగ్రామ్ ప్రారంభం అయినప్పటి నుంచి వీళ్లిద్దరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ వచ్చారు. రోజా కూడా వైసీపీలో కీలక నేతగా ఉంటూనే ఈ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించింది. కానీ నాగబాబు మాత్రం.. నిర్మాతగా లాస్ కావడంతో సినిమాల్లో క్యారెక్టర్ నటుడిగా స్థిర పడ్డాడు. దాంతో పాటు జబర్ధస్త్ కామెడీ షోలో జడ్జ్‌గా ఉండాలంటూ మల్లెమాల వాళ్లు అపుడే నాగబాబును సంప్రదించడంతో వెంటనే ఈ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రోగ్రామ్ ఐదారేళ్లుగా సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూనే ఉంది. కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోజా, నాగబాబు.. కొన్నాళ్లు ఈ ప్రోగ్రామ్‌కు విరామం ప్రకటించి ఇద్దరు రాజకీయ రంగంలో తలపడ్డారు. రోజా.. మాత్రం రెండోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గెలిచి పార్టీ అధికారంలోకవి రావడంతో ఆమెపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర చెరిగిపోయింది. మరోవైపు నాగబాబు కూడా తమ్ముడు జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

    Jabardasth Comedy Show sensational shock to Nagababu and Adirindi TRP ratings are very poor pk ఏడేళ్ళ జబర్ధస్త్ కామెడీ షోను మూడు వారాల అదిరింది షోతో పోల్చడం సరైంది కాదు.. కానీ కచ్చితంగా పోలుస్తారు.. దానికి కారణం నాగబాబు. అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి కచ్చితంగా వద్దన్నా కూడా రేటింగ్స్.. jabardasth comedy show,adirindi comedy show,nagababu mallemala productions,jabardasth comedy show secrets,jabardasth comedy show judge,jabardasth nagababu,nagababu channel,nagababu my channel naa istam,nagababu interview,jabardasth comedy show episode,jabardasth comedy show latest episode,jabardasth latest promo,jabardasth comedy show directors,jabardasth comedy show mallemala,jabardasth comedy show shyam prasad reddy,jabardasth comedy show promo,sudigali sudheer,rashmi gautam,anasuya bharadwaj,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జాతకం బయటపెట్టిన నాగబాబు,నాగబాబు ఛానెల్,నాగబాబు మై ఛానెల్ నా యిష్టం,నాగబాబు జబర్దస్త్,జబర్దస్త్ సీక్రేట్స్,తెలుగు సినిమా
    నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్


    ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మళ్లీ రోజా, నాగబాబు జబర్ధస్త్ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ముందు నుంచి రోజా రాజకీయాల్లో ఉన్న నాగబాబుతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ ఎపుడైతే నాగబాబు.. జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ వ్యతిరేకంగా పనిచేసారో అప్పటి నుంచి రోజా పై రాజకీయంగా కొన్ని ఒత్తిడిలు పెరిగినట్టు సమాచారం.దాంతో ఆమె మల్లెమాల టీమ్ వాళ్లతో సంప్రదించి తనకు వ్యతిరేక పార్టీలో నాగబాబును పొమ్మనలేక పొగ పెట్టేలా చేసిందనేది ఒక టాక్. దీంతో నాగబాబు జబర్థస్త్ షోలో ఇమడలేక.. వేరే ఛానెళ్లో తన దారి తాను చూసుకున్నట్టు చెబుతున్నారు. ఇందులో నిజా నిజాలు ఎంతో తెలియదు కానీ.. చాలా మంది మాత్రం ఇది నిజమని నమ్ముతున్నారు. మొత్తానికి నాగబాబు.. జబర్థస్త్ షో వీడడానికి రాజకీయాలు కూడా ఓ కారణమనే ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: