Home /News /movies /

NAGABABU EMOTIONAL TWEET ON HIS FATHER DEATH ANNIVERSARY SB

Nagababu: నాకు అప్పుడు ఆ సెన్స్ లేకుండా పోయింది...నాగబాబు ఎమోషనల్ ట్వీట్

చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)

చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)

దయచేసి చెప్తున్నా.. మీ ఆత్మీయులు బతికి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్‌ పంచుకోండి అంటూ నాగబాబు సోషల్‌ మీడియాలో ట్వీట్ చేశారు.

    జ‌న‌సేన పీఏసీ స‌భ్యుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగా బ్రదర్‌ కొణిదెల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు.  నాగబాబు తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఆయన్ను తలచుకుని ఎమోషనల్‌ అయ్యాడు. 'నాన్నా నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు బతికి ఉన్నప్పుడు చెప్పాలన్న సెన్స్‌ గానీ, జ్ఞానం కానీ నాకు లేవు. అవి వచ్చాయనుకున్నప్పుడు నువ్వు లేవు . దీంతో పాటు నెటిజన్స్’కు ఓ విజ్ఞప్తి కూడా చేశారు.

    దయచేసి చెప్తున్నా.. మీ ఆత్మీయులు బతికి ఉన్నప్పుడే వారితో మీ ఎమోషన్స్‌ పంచుకోండి' అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ మేరకు తన తండ్రి ఫొటోను షేర్‌ చేశాడు. మెగా  ఫాదర్‌ కొణిదెల వెంకట్రావు విషయానికి వస్తే.. శోభన్ బాబు హీరోగా నటించిన ‘జగత్ కిలాడీలు’ అనే ఓ సినిమాలో ఆయన నటించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో చిరంజీవితో పాటు కలిసి నటించారు.



    ఇక నాగబాబు విషయానికి వస్తే.. ఇటు రాజకీయాలు, అటు సినిమాల్లో ఆయన చురుకుగా ఉన్నారు.  నాగబాబు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఆయన మద్దతు తెలిపారు. పవన్‌కు సపోర్ట్‌గా జనసేన తరపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను కార్యకర్తగా పనిచేస్తానని ఆ పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    నాగబాబు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు పలు కీలక సూచనలు చేశారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి..? పార్టీ సిద్దాంతాలను ప్రజలకు ఎలా వివరించాలి..? అనే విషయాలపై అవగాహన కల్పించారు. జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాగబాబు సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని చెప్పారు.

    అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవినీతి అనే పదమే వినపడకుండా ప్రజా ప్రయోజన పరిపాలన అందిస్తారన్నారు నాగబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకూ తాను ఒక కార్యకర్తగా పని చేస్తాఅన్నారు నాగబాబు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పని చేయాల్సిన అవసరం ఉంది.  జనసేన కార్యకర్తలంతా అంతా సమష్టిగా పని చేయాలని నాగబాబు సమావేశంలో పిలుపునిచ్చారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Mega Family, Megastar Chiranjeevi, Nagababu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు