హోమ్ /వార్తలు /సినిమా /

Nagababu-Garikapati: గరికపాటికి మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్.. ఏపాటి వాడికైనా అంటూ..

Nagababu-Garikapati: గరికపాటికి మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్.. ఏపాటి వాడికైనా అంటూ..

నాగబాబు, గరికపాటి (ఫైల్ ఫోటో)

నాగబాబు, గరికపాటి (ఫైల్ ఫోటో)

Nagababu: అలయ్ బలయ్ జరిగిన కొన్ని గంటల తరువాత నాగబాబు గరికపాటిని టార్గెట్ చేస్తూ ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావుకు మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఏపాటి వాడికైనా అంటే అదే గరికపాటిని(Garikapati Narasimha Rao) ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అనే చర్చ మొదలైంది. చిరంజీవిపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే నాగబాబు(Nagababu) ఈ రకమైన ట్వీట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు దసరా తరువాత సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు.

  ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో అయన అదే వేదికపై ఉన్న చిరంజీవిపై(Chiranjeevi) అసహ నోరు విరిచారు. స్టేజిపై గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి కొంతమంది యువత వేదిక మీదకు వచ్చారు. గరికపాటి ప్రసంగాన్ని వారు పట్టించుకుపోవడంతో ఆగ్రహం చెందిన ఆయన చిరంజీవిని ఉద్దేశించి పలువ వ్యాఖ్యలు చేశారు.

  చిరంజీవి గారు మీరు ఫోటోలు దిగడం ఆపితేనే తాను మాట్లాడతానని.. లేదంటే తాను ప్రసంగం ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోతానని ఘాటుగా వ్యాఖ్యానించారు. గరికపాటి ఆ వ్యాఖ్యలు చేయడంతో చిరంజీవి అభిమానులతో ఫోటోలు దిగడం ఆపి తన సీటులో కూర్చున్నారు.

  Chiranjeevi: చిరంజీవి గారూ ఇక ఆపేయండి! మెగాస్టార్‌కి గరికపాటి షాకింగ్ రిక్వెస్ట్

  God Father: ’గాడ్ ఫాదర్’ సహా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వసూళ్లు సాధించిన చిరంజీవి సినిమాలు..

  ఆ తరువాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల తరువాత నాగబాబు గరికపాటిని టార్గెట్ చేస్తూ ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Chiranjeevi, Nagababu

  ఉత్తమ కథలు