కరెన్సీ నోటుపై గాంధీతో పాటు సావర్కర్‌కు స్థానం : నాగబాబు మరో వివాదస్పద ట్వీట్...

నాగబాబు

నాగబాబు ట్విట్టర్ వేదికగా మరోసారి వివాదస్పద పోస్ట్ పెట్టాడు. ఇండియన్ కరెన్సీ నోట్ల పై గాంధీతో పాటు సావర్కార్,వాజపేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందని పేర్కోన్నాడు.

  • Share this:
    నాగబాబు కొణిదెల.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా నాగబాబు నటుడుగాను, నిర్మాతగాను రియాలిటీ షోలకు జడ్జ్‌గాను చేస్తూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అది అలా ఉంటే నాగబాబు ఏదో ఓ విషయంపై తరచూ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. అందులో భాగంగా ఇటీవల ఓ వివాదస్పద పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌లో మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 'ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. అయితే అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే) 'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని తెలుగులో ఓ ట్వీట్ చేసాడు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై నెటిజన్స్  తీవ్రంగా  మండిపడ్డారు. దీంతో ఆయన దానికి ఓ వివరణ కూడా ఇచ్చాడు.

    అది అలా ఉంటే ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా మరో పోస్ట్ పెట్టాడు. ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై కొందరూ ఆయన్ను సమర్ధిస్తుంటే.. మరికొందరూ విమర్శిస్తున్నారు. ఇంకా నయం గాడ్సే ఫోటో పెట్టమని అడగలేదంటూ సటైర్స్ వేస్తున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published: