నాథూరాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.. అనుకున్నది చేశాడు : నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు

నాగబాబు (Twitter/nagababu)

నాగబాబు కొణిదెల.. మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

  • Share this:
    నాగబాబు కొణిదెల.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా నాగబాబు నటుడుగాను, నిర్మాతగాను రియాలిటీ షోలకు జడ్జ్‌గాను చేస్తూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం జీ తెలుగులో వచ్చే అదిరింది షోతో పాటు పలు టీవీషోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు నాగబాబు. ఈ షో ఆయనకు చాలా పేరుతో పాటు పాపులారిటీని తీసుకొచ్చింది. అది అలా ఉంటే నాగబాబు ఏదో ఓ విషయంపై తరచూ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. అందులో భాగంగా తాజాగా ఓ వివాదస్పద పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సే గురించి కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 'ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం.


    అయితే అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే) 'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని తెలుగులో ఓ ట్వీట్ చేసాడు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. దేశ భక్తి ఉంటే చాలా మనిషిని ఎలా చంపుతాడు.. అదీ కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: