Nagababu : మెచ్యూరిటీ లేక... నిహారిక వరుణ్‌ల విషయంలో ఆ తప్పు చేశాను. : నాగబాబు

Nagababu : నాగబాబు కొణిదెల.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

news18-telugu
Updated: November 25, 2020, 7:25 AM IST
Nagababu : మెచ్యూరిటీ లేక... నిహారిక వరుణ్‌ల విషయంలో ఆ తప్పు చేశాను. : నాగబాబు
నాగబాబు (Youtube/Credit)
  • Share this:
నాగబాబు కొణిదెల.. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో భాగంగా నాగబాబు నటుడుగాను, నిర్మాతగాను రియాలిటీ షోలకు జడ్జ్‌గాను చేస్తూ తన కంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఆయన ప్రస్తుతం జీ తెలుగులో వచ్చే అదిరింది షోతో పాటు పలు టీవీషోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయ్యాడు నాగబాబు. ఈ షో ఆయనకు చాలా పాపులారిటీని తీసుకొచ్చింది. అది అలా ఉంటే నాగబాబుకు సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి తెలిసిందే. 'మన ఛానల్ మన ఇష్టం' అనే ఛానల్ ద్వారా అన్ని విషయాలపై నాగబాబు స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా తన కుటుంబ విషయాలు సినిమా సంగతులతో పాటు పలు సామాజిక అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం, ప్రవర్తన తీరు.. ఎలా ప్రవర్తించాలి.. వారిని చిన్నప్పటి నుంచి ఎలా గ్రూమ్ చేయాలి అనే విషయాలను చర్చించాడు. అందులో భాగంగా తన పిల్లలు నిహారిక, వరుణ్ తేజ్ లతో తన ప్రవర్తన ఎలా ఉండేది.. ఆ తర్వాత ఎలా మార్చుకున్నారో తెలియ జేశాడు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ''నేను గొప్ప కమ్యూనికేటర్ ని కాకపోవచ్చు గానీ ఎంతో కొంత బెటర్ అని నా ఫీలింగ్. నా పిల్లలు నిహారిక వరుణ్ లకు చాలా విషయాలు చెప్పేవాడిని.

కూతురు నిహారికతో నాగబాబు (Instagram/Photo)


ఇంకా ఆయన మాట్లాడుతూ.. నేను నా పిల్లలకు ఎప్పుడూ ఒక్క విషయం చెబుతాను అందేంటంటే... మీరు మొదట తల్లిదండ్రులతో ఫ్రీ గా మాట్లాడండి. ఎలాంటీ విషయాన్ని అయినా.. అన్ని షేర్ చేసుకోండి. ఓ సందర్భంలో నా ఇద్దరు పిల్లలతో ఈ మాట అన్నాను.. 'ఈ భూమి మీద మీ జీవితంలో ఏ సమస్యను అయినా నేనొక్కడిని మాత్రమే అర్థం చేసుకొని పరిష్కరించగలను. చెప్పుకోలేని సమస్య వచ్చినా చెప్పండి. ఎందుకంటే ఈ భూమిపై మీ కంటే నాకు విలువైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని.. అలా మనం వారికి గ్యారెంటీ ఇవ్వాలి. ఇక నాగబాబు షోల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం జీ తెలుగులో రెండు షోలను చేస్తున్నాడు. అదిరింది, బొమ్మ అదిరింది అని రెండు కామెడీ షోలే. ఇక ఆయన కూతురు నిహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.
Published by: Suresh Rachamalla
First published: November 25, 2020, 7:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading