నాగబాబు మరో సంచలన ట్వీట్.. ఈ సారి రజినీకాంత్‌ను టార్గెట్ చేస్తూ..

మెగా బ్రదర్ నాగబాబు.. కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా పవన్ కళ్యాణ్ అన్నగా జనసేన పార్టీ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన దేవుడు అనే కాన్సెప్ట్‌తపై

news18-telugu
Updated: July 14, 2020, 1:25 PM IST
నాగబాబు మరో సంచలన ట్వీట్.. ఈ సారి రజినీకాంత్‌ను టార్గెట్ చేస్తూ..
నాగబాబు, రజినీకాంత్ (File/Photos)
  • Share this:
మెగా బ్రదర్ నాగబాబు.. కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా పవన్ కళ్యాణ్ అన్నగా జనసేన పార్టీ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో ఈయన నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎప్పటికపుడు ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. నిన్నటి మొన్నటి వరకు ఈయన జబర్ధస్త్ షో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తాజాగా ‘అదిరింది’ అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈయన ఏదో ఒక ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూనే ఉన్నాడు. తాజాగా నాగబాబు దేవుడి ఇష్యూపై స్పందించాడు. గతంలో హిందూ దేవుళ్లపై విమర్శలు చేసిన వాళ్లపై అటాక్ చేసినా ఈయన.. ఇపుడు ా దేవుడే లేడంటూ కామెంట్ చేయడం విశేషం. ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు. అది ఏమిటంటే.. మన కంటికి కనిపించేది ఏదైనా.. ఎవరు ఒకరు క్రియేట్ చేసిందే అయివుంటుంది. లేకపోతే ఆ వస్తువు అనే దానికి ఉనికి లేదు. అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికిలో ఉందంటే దాన్ని కూడా ఎవరో ఒకరు క్రియేటర్ ఉండే ఉండాలి. ఆయనే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పాడు.
మరి అంత క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు. ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీసన్ వేరే ఉండాలి. ఆ కరాణమే దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్‌కు ఇంకో రీసన్ ఉండి తీరాలి. సో వెతుక్కుంటూ వెళితే.. దానికి అంతే ఉండదు. సో దేవుడినే కాన్సెప్ట్ కి అసలు మీనింగే లేదంటూ చెప్పుకొచ్చాడు. సో మనందరం దేవుడు లేకుండా జీవించడం ఎలాగో నేర్చుకుంటో సరిపోతుందన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు సమర్ధిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 14, 2020, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading