బాలయ్యపై నాగబాబు మరోసారి సెటైరికల్ కామెంట్స్...అసలు కారణం అదేనా?

రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నాగబాబు పెద్ద బాంబు పేల్చి బాలయ్య అభిమానులకు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలయ్యపై కమెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు నాగబాబు.

news18-telugu
Updated: December 10, 2018, 3:39 PM IST
బాలయ్యపై నాగబాబు మరోసారి సెటైరికల్ కామెంట్స్...అసలు కారణం అదేనా?
బాలకృష్ణ, నాగబాబు
  • Share this:
రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నాగబాబు పెద్ద బాంబు పేల్చి బాలయ్య అభిమానులకు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పాను క‌దా.. సారీ సారీ తెలుసు.. ఆయ‌న గురించి నాకు తెలుసు.. బాలయ్య చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్ నటుడు. అప్పట్లో నేరము-శిక్ష లాంటి సినిమాల్లో కృష్ణ, బాలయ్య కలిసి న‌టించారంటూ చెప్పాడు.  ఆ బాల‌య్య కాదండి.. ఇప్పుడు మేం అడుగుతున్న‌ది నందమూరి బాలకృష్ణ గురించి అని మీడియా వాళ్లు అడిగితే.. ఆ త‌రం బాల‌య్య తెలుసు కానీ ఈ త‌రంలో ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.

మరోవైపు నాగబాబును ఉద్దేశించి బాలయ్య అభిమానులు...ఏంటి మా బాలయ్య ఎవరో తెలియదా అంటూ అప్పట్లో బాలయ్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాగబాబును ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

చిరు, బాలయ్యతో నాగబాబు (ట్విట్టర్ ఫోటో)


మరోవైపు ఆ ఇష్యూ చల్లారకముందే మరోసారి నాగబాబు..బాలకృష్ణ పెద్ద కమెడియన్ అంటూ మరో సెటైర్ వేసాడు. నిన్న ఫేస్‌బుక్‌లో లైవ్‌లో బాలకృష్ణ ఎవరో చెప్పమంటే తెలియదని చెప్పాను.  సారీ నాకు బాలకృష్ణ తెలుసు..పాత సినిమాల్లో మంచి నటుడు అంతకు మించి మంచి కమెడియన్..ఎన్టీఆర్‌తో ‘పాతాళ భైరవి’ సహా ఎన్నో సినిమాల్లో కమెడియన్ వేషాలు వేసాడంటూ అప్పటి కమెడియన్ ఫోటో చూపిస్తూ...బాలయ్య అభిమానులకు మరోసారి కోపం తెప్పించాడు.గతంలో బాలకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని చెప్పారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద రచ్చ నడిచింది. తాజాగా నాగబాబు కామెంట్స్ చూస్తుంటే...ఈ ఇష్యూను తెగేవరకు లాగుతున్నాడా అని సినీ, రాజకీయా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా రాజకీయంగా టీడీపీ, జనసేన ఉప్పు నిప్పుగా ఉన్నాయి. తాజాగా నాగబాబు..కామెంట్స్ రెండు పార్టీలు ముఖ్యంగా నందమూరి, మెగాభిమానుల మధ్య ఆజ్యం పోసినట్టే ఉంది.

బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఫోటో)
ఒకవైపు నందమూరి, మెగా కుటుంబాలకు చెందిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అంటూ భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తుంటే..ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు మాత్రం రాజకీయంగా ఢీ అంటే ఢీ అంటున్నారు. 2019 ఏప్రిల్‌లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్‌లో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే పవన్ కళ్యాణ్ కింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే నాగబాబుతో ఇలా మాట్లాడించిందా అని అందరూ చెప్పుకుంటున్నారు.  అలాంటి పరిస్థితి వస్తే..చంద్రబాబు సహా అందరూ పవన్ కళ్యాణ్‌తో కాళ్ల బేరానికి వస్తారనే ధైర్యమే నాగబాబుతో ఇలా మాట్లాడించిందా అని కొంత మంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకవేళ నాగబాబు కామెంట్స్‌పై బాలయ్య ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి. గతంలో రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకులు వాళ్ల సినిమాల్లో బాలయ్యను కామెంట్స్ చేసినా అంతగా పట్టించుకోని బాలకృష్ణ...ఇపుడు నాగబాబు మాటలపై స్పందిస్తారా అని చాలా మంది అనుమానపడుతున్నారు. ఒక వేళ బాలయ్య ..నిజంగానే స్పందిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. మొత్తానికి నాగబాబు కామెంట్స్..ఇపుడు సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి

నాగబాబు క‌మెంట్స్‌పై మండి ప‌డుతున్న బాల‌కృష్ణ ఫ్యాన్స్..

బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దంటున్న కొణిదెల నాగ‌బాబు..

అవార్డ్ విన్నింగ్ ద‌ర్శ‌కున్ని ఆదుకుంటున్న రానా ద‌గ్గుపాటి..
First published: December 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>