నాగబాబుకు షాకుల మీద షాకులు.. ఈ సారి మాత్రం..

Nagababu | మెగా బ్రదర్ నాగబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 22, 2020, 9:22 AM IST
నాగబాబుకు షాకుల మీద షాకులు.. ఈ సారి మాత్రం..
నాగబాబు (Twitter/nagababu)
  • Share this:
మెగా బ్రదర్ నాగబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వివరాల్లోకి వెళితే..  తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో 'జబర్ధస్త్'. ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతుంది. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి  పరిచయమయ్యారు. ఇందులో కొంత మంది నటులు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ షోతోనే మెగా బ్రదర్ నాగబాబుకు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఏమైందో ఏమో జబర్ధస్త్ కామెడీ షో నిర్వాహకులు మల్లెమాల వాళ్లతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా నాగబాబు జబర్దస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించారు. దాంతో పాటు ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో మరో షోను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోతో జబర్ధస్త్ కామెడీ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి. ఈ షో కోసం నాగబాబు..తనతో  పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటలును తీసుకువెళ్లడం జరిగింది. తీరా ఈ ప్రోగ్రామ్ ప్రసారమయ్యే సరికి.. ప్రేక్షకులు ఈ  షో చూసి జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేపారు.

nagababu adirindi comedy show get low trp ratings,nagababu adirindi,nagababu adirindi low trp ratings,jabardasth comedy show,Nagababu,Nagababu jabardasth comedy show,adirindi show success or not,pawan kalyan,pawan kalyan nagababu,mega brothers chiranjeevi nagababu pawan kalyan,roja,mla roja,apiic chariman roja,roja nagababu,roja jabardasth judge,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,nagababu facebook,nagababu Election Affidavit,Nagababu Assets,How much nagababu assets value,jabardasth comedy show,Andhra Pradesh news,Andhra Pradesh politics,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,Nagababu Narsapuram MP,Nagababu Narsapuram Lok Sabha Seat,Rashmi gautham,anasuya,nagababu janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,nagababu,naga babu,nagababu interview,nagababu about pawan kalyan,nagababu speech,nagababu janasena,nagababu pawan kalyan,nagababu latest speech,nagababu quit jabardasth,nagababu exclusive interview,pawan kalyan,#nagababu,nagababu quit,nagababu on rgv,nagababu latest,venu vs nagababu,nagababu new show,konedela nagababu,nagababu new speech,hyper aadi nagababu,nagababu zee telugu,jabardasth nagababu,nagababu angry speech,నాగబాబు, జబర్దస్త్ కామెడీ షో, అదిరింది షో, నీహారిక,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,నాగబాబు ఆస్తులు,నాగబాబు ఆస్తుల వివారాలు,నాగబాబు ఎన్నికల అఫిడవిట్,జబర్థస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నరసాపురం ఎంపీ టికెట్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు ఆస్తులు,నాగబాబు అప్పులు,నాగబాబు నిర్మాత,నాగబాబు ఆస్తులు అప్పులు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,నాగబాబు ఆస్తులు, నాగబాబు అప్పులు,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,రోజా,రోజా నాగబాబు,రోజాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్,పవన్ కళ్యాణ్,నాగబాబు,నాగబాబు పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు,అదిరింది లో టీఆర్పీ రేటింగ్స్
నాగబాబు


ఐతే తొలివారం నుంచి ఈ షోకు అనుకున్నంత రేంజ్‌లో టీఆర్పీలు రాలేదు. ఆ తర్వాత కొంచెం పుంజుకుంటున్నట్టు కనిపించానా.. తాజాగా ఈ వారం విడుదలైన అదిరింది ప్రోగ్రామ్‌కు కళ్లు చెదిరేలా అసలు టీఆర్పీ రాలేదు. అంతేకాదు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌కు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. దాంతో చిన్న చితక సీరియల్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉన్నా.. నాగబాబు అదిరింది మాత్రం అదరగొట్టలేకపోతుంది. దీంతో నాగబాబుతో జీ తెలుగును నెంబర్ ఛానెల్‌గా నిలపలాన్న జీ తెలుగు ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ఈ ఛానెల్ నిర్వహాకులు ముందుగా వీళ్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 25 ఎపిసోడ్ల కాంట్రాక్ట్ తర్వాత ఈ ప్రోగ్రామ్‌ను ఆపేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. మరోవైపు నాగబాబు.. తన పాత టీమ్ మెంబర్స్‌తో కలిసి మరలా జబర్ధస్త్‌ షోలకు రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ఎక్కడైనా వ్యవస్థను నమ్ముకుని వ్యక్తి పని చేయాలి కానీ వ్యక్తిని నమ్ముకుని వ్యవస్థ అయితే పని చేయదు. నాగబాబు, మల్లెమాల విషయంలో కూడా ఇదే జరిగిందని అందరు చెప్పుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 22, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading