హోమ్ /వార్తలు /సినిమా /

Virata parvam: నగాదారిలో సాంగ్ రిలీజ్.. అబ్బురపరుస్తున్న రానా, సాయి పల్లవి విజువల్స్

Virata parvam: నగాదారిలో సాంగ్ రిలీజ్.. అబ్బురపరుస్తున్న రానా, సాయి పల్లవి విజువల్స్

Photo Twitter

Photo Twitter

జూన్ 17న విరాటపర్వం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఆసక్తికర అప్‌డేట్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'విరాటపర్వం' నుంచి నగాదారిలో సాంగ్ లిరికల్ వీడియో వదిలారు.

ఇంకా చదవండి ...

టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా ( Daggubati rana) ప్రధాన పాత్రలో రూపొందిన కొత్త సినిమా 'విరాటపర్వం' (Virata Parvam). ఈ సినిమాకు వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వం వహించగా రానాతో నాచురల్ క్వీన్ సాయి పల్లవి (Sai Pallavi) తెరపంచుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు జూన్ 17న (Virata Parvam Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి ఆసక్తికర అప్‌డేట్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'విరాటపర్వం' నుంచి నగాదారిలో సాంగ్ (Nagaadaarilo Song) లిరికల్ వీడియో వదిలారు.

నక్సల్స్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథగా ఈ విరాటపర్వం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రానా, సాయి పల్లవి లుక్స్ పరంగా కంప్లీట్ చేంజ్ అయి పాత్రలో ఇమిడిపోయారని తాజాగా విడుదల చేసిన నగాదారిలో సాంగ్ విజువల్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. 'నగాదారిలో' అంటూ సాగిపోతున్న ఈ సాంగ్ అబ్బురపరిచే సన్నివేశాలతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

రానా, సాయి పల్లవి విజువల్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. ఈ పాటకు దేవెర నరేందర్, భరద్వాజ్ లిరిక్స్ రాయగా.. వరంగల్ లోని వీరువాడకి చెందిన జానపద గాయని వరం ఆలపించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా వదిలిన సాంగ్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ మూవీలో రానా మావోయిస్టు పాత్రలో నటించగా.. ఆయన్ను ప్రేమించే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. సాయుధ పోరాటంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ప్రేమకథ సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు.

ఇకపోతే తాజాగా విడుదల చేసిన నగాదారిలో పాటను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన రానా.. ''ఇంతదాక పుట్టలేదుగ - ప్రేమ కన్న గొప్ప విప్లవం'' అంటూ ట్యాగ్ లైన్ రాశారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ భారీ వ్యూస్ రాబట్టింది. ఈ చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Rana daggubati, Sai Pallavi, Virata Parvam

ఉత్తమ కథలు