హోమ్ /వార్తలు /సినిమా /

Krishna Vrinda Vihari Movie Review: ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ.. అక్కడక్కడ ఆకట్టుకుంటుంది..

కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari)
కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari)
2.5/5
రిలీజ్ తేదీ:23/9/2022
దర్శకుడు : అనీష్ ఆర్ కృష్ణ
సంగీతం : మహతి స్వర సాగర్ (Mahathi Swara Sagar)
నటీనటులు : నాగ శౌర్య, షిర్లే సేతియా, రాధిక శరత్ కుమార్, అన్నపూర్ణ, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు..
సినిమా శైలి : Family Drama

Krishna Vrinda Vihari Movie Review: ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ రివ్యూ.. అక్కడక్కడ ఆకట్టుకుంటుంది..

కృష్ణ వ్రిందా విహారి మూవీ రివ్యూ (Twitter/Photo)

కృష్ణ వ్రిందా విహారి మూవీ రివ్యూ (Twitter/Photo)

Krishna Vrinda Vihari Movie Review : నాగ శౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛలో తర్వాత సరైన సక్సెస్ లేని ఈయన గతేడాది ‘వరుడు కావాలెను’, ‘లక్ష్య’ సినిమాలతో పలకరించినా.. అంత పెద్దగా సక్సెస్ కాలేదు.తాజాగా ఈయన అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో పలకరించారు. ఈ మూవీతో నాగ శౌర్య హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari)

నటీనటులు : నాగ శౌర్య, షిర్లే సేతియా, రాధిక శరత్ కుమార్, అన్నపూర్ణ, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు..

ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని

సినిమాటోగ్రఫీ: తమ్మిరాజు

సంగీతం: మహతి స్వరసాగర్

నిర్మాత : ఉషా ముల్పూరి

దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ

విడుదల తేది :23/9/2022

నాగ శౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛలో తర్వాత సరైన సక్సెస్ లేని ఈయన గతేడాది ‘వరుడు కావాలెను’, ‘లక్ష్య’ సినిమాలతో పలకరించినా.. అంత పెద్దగా సక్సెస్ కాలేదు.తాజాగా ఈయన అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో పలకరించారు. ఈ మూవీతో నాగ శౌర్య హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

కథ విషయానికొస్తే.. 

కృష్ణ చారి (నాగ శౌర్య) సనాతన బ్రాణ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో ఉన్న ఊరి నుంచి హైదరాబాద్ వస్తాడు. అక్కడ కంపెనీలో అతిని టీమ్ లీడర్‌గా వ్రిందా(షిర్లే)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తనకు బాస్ పొజిషన్‌లో ఉన్న వ్రిందాతో ప్రేమలో పడతాడు. ఈ  క్రమంలో  వీరి పెళ్లికి సంప్రదాయ కుటుంబానికి చెందిన హీరో ఫ్యామిలీ ఒప్పుకుందా ? ఈ నేపథ్యంలో జరిగిన డ్రామానే ’కృష్ణ వ్రిందా విహారి’ స్టోరీ.

కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే.. 

దర్శకుడు అనీష్ కృష్ణ విషయానికొస్తే.. తొలి చిత్రమే అయినా తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సూటిగా చెప్పాలనుకున్న ఈ సినిమా చూస్తుంటే.. రీసెంట్‌గా ఇలాంటి తరహా నేపథ్యంలో వచ్చిన ‘అంటే సుందరానికీ’ అక్కడక్కడ జ్ఞప్తికి వస్తూ ఉంటోంది. ఎందుకంటే దర్శకుడు ఎంచుకున్న కథలో హీరో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్రలో చూపించాడు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌తో ప్రేమలో పడే సన్నివేశాలతో పాటు ఆఫీస్ వాతావారణంలో మంచి కాెమడీని రాబట్టాడు. ఇందులో కూడా ‘అంటే సుందరానికీ’ తరహాలో హీరో కూడా తనలో లోపం ఉందని కుటుంబాన్ని ఒప్పించి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్, హీరో తల్లి (రాధిక శరత్ కుమార్) మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సీరియల్ తరహాలో సాగుతోంది. మొత్తంగా దర్శకుడిపై సీరియల్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ ఆడియన్స్ కన్ఫ్యూజన్ కాకుండా ఒకింత క్లారిటీతో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు. ఎమోషన్స్ అక్కడక్కడ మిస్ అయినట్టు కనిపిస్తాయి.  ఇక్కడ హీరోయిన్ సామాజిక వర్గాన్ని నార్త్ ఇండియాకు చెందిన బ్రాహ్మాణ యువతిగా చూపించి .. హీరో, హీరోయిన్ ఒకటే సామాజిక వర్గం అంటూ క్లారిటీ ఇచ్చినా.. ఆమెకు తాగుడు, తినడం వంటివి హాబిట్స్ వంటివి చూపించారు. మొత్తంగా ఈ సినిమాలో కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసినా.. ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది  చూడాలి.

ఈ సినిమాకు మహతి స్వరసాగర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగుుంది. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలున్నాయి. ఇక ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే.. 

నాగ శౌర్య .. కృష్ణచారి పాత్రలో ఎంతో ఈజ్‌తో నటించాడు. తనలో మంచి నటుడున్నడని గతంలో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా కృష్ణ చారి అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో మంచి నటనే కనబరిచాడు. ఇక హీరోయిన్‌గా నటించిన షిర్లే సేతియా నటన కంటే ఎక్కువగా అంగాంగ ప్రదర్శనకే ప్రాముఖ్యత ఇచ్చినా.. ఉన్నంతలో  తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ఫస్ట్ సినిమాకే తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇక హీరో తల్లి పాత్రలో నటించిన రాధిక శరత్ కుమార్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ ఉన్నంతలో నవ్వించారు.సీనియర్ నటి అన్నపూర్ణ మరోసారి తన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్ 

నాగ శౌర్య, రాధిక నటన

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ 

సీరియల్‌ను తలపించే కథ, కథనం

సెకండాఫ్ ల్యాగ్

ప్రేక్షకులకు కనెక్ట్ కానీ ఎమోషన్ సీన్స్

చివరి మాట : కృష్ణ వ్రిందా విహారి.. అక్కడక్కడ ఆకట్టుకుంటుంది..

రేటింగ్ : 2.5/5

First published:

రేటింగ్

కథ:
2.5/5
స్క్రీన్ ప్లే:
3/5
దర్శకత్వం:
2.5/5
సంగీతం:
3/5

Tags: Krishna Vrinda Vihari, Naga shourya, Tollywood

ఉత్తమ కథలు