హోమ్ /వార్తలు /సినిమా /

Naga Shourya - Lakshya: నాగ‌శౌర్య ‘ల‌క్ష్య’ స్టోరీ పాయింట్ ఇదేనా?

Naga Shourya - Lakshya: నాగ‌శౌర్య ‘ల‌క్ష్య’ స్టోరీ పాయింట్ ఇదేనా?

Naga shourya latest movie Lakshya story line full details here

Naga shourya latest movie Lakshya story line full details here

Naga Shourya - Lakshya: సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రం లక్ష్యకు పురాణ పురుషుడు ఏకలవ్యుడు పాత్రే ఆధారమని వార్తలు వినిపిస్తున్నాయి

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ల‌క్ష్య’ . ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నారాయ‌ణ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. కాగా.. ఈ సినిమా కోసం నాగశౌర్య బాగానే క‌ష్ట‌ప‌డుతున్నాడు. సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ పెంచాడు. అంతే కాదండోయ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియ‌న్ సినిమాల్లో రాన‌టువంటి విలువిద్య ఆట‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు సంతోష్ ఈ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌.

అయితే క‌థ‌లో ఓ అస‌లు ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో నాగ‌శౌర్య విలువిద్య పోటీల కోసం క‌ష్ట‌ప‌డి విలువిద్య‌ను ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాడు. కానీ.. ఓ ప్ర‌మాదంలో హీరో బొట‌న‌వేలుకి గాయ‌మై, ఆ వేలుని తీసేస్తారు. విలువిద్య నేర్చుకునే వారికి బొట‌న‌వేలు ఎంతో కీల‌కం. ఆ వేలు పోవ‌డంతో హీరో ఎంతో నిరుత్సాహ‌ప‌డ‌తాడు. కానీ గురువు అయిన జ‌గ‌ప‌తిబాబు ఇచ్చే ఉత్సాహంతో మ‌ళ్లీ విలువిద్య‌ను ప్రాక్టీస్ చేసి దేశానికి ప్రాతినిధ్యం వ‌హించి దేశానికి పేరు తెస్తాడ‌ట‌.

క‌థ వింటుంటే.. ఓ పురాణ పురుషుడు పాత్ర ఒక‌టి గుర్తొస్తుంది కదా!. ఆపురాణ పురుషుడెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏక‌ల‌వ్యుడు. మ‌హాభార‌తంలో ఆట‌వికుడైన ఏక‌ల‌వ్యుడు ద్రోణుడుని త‌న గురువుగా భావించి అర్జునుడికి ధీటుగా విలువిద్య‌లో ఆరితేరుతాడు. అది న‌చ్చ‌కుండా ద్రోణుడు ఏక‌ల‌వ్యుడు గురుద‌క్షిణగా బోట‌న‌వేలుని అడుగుతాడు. గురువు కోసం ఏక‌ల‌వ్యుడు వేలుని ఇచ్చేస్తాడు. కానీ ఈ క‌థ‌ను కాస్త ఆటు ఇటు మార్చి సినిమా క‌థ‌గారూపొందించారు.

First published:

Tags: Naga shourya, Tollywood

ఉత్తమ కథలు