చేతినిండా సినిమాలో బిజీ బిజీగా ఉన్న యువ హీరోల్లో నాగశౌర్య ఒకడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా లక్ష్య సినిమాతో పాటు రీతూవర్మతో కలిసి వరుడు కావలెను సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే తన సొంత బ్యానర్‌లోనే అనీశ్ కృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో నటించడానికి నాగశౌర్య ఓకే చెప్పాడట. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో నటింప చేయడానికి చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు, ఈ సినిమాలో నాగశౌర్య ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. వివరాల మేరకు ఈ చిత్రంలో నాగశౌర్య మాటలు రాని, చెవులు వినపడని యువకుడిగా కనిపించబోతున్నాడట. నాగశౌర్య హీరోగా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో డిఫరెంట్ పాత్రలు చేయడం.. అది కూడా బాలకృష్ణ వంటి సీనియర్ హీరోతో కలిసి పనిచేయడం ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది ఆలోచించాల్సిన విషయం. గతంలో బాలకృష్ణతో ఆదిత్య 369 వంటి క్లాసిక్ మూవీ చేసిన శివలెంక కృష్ణ ప్రసాద్.. ఆ పరిచయంతో బాలకృష్ణను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట ఈ నిర్మాత. బాలయ్య కూడా దాదాపు ఓకే అనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీమాన్ వేముల అనే డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.