Home /News /movies /

NAGA SHAURYA RITU VARMAS VARUDU KAAVALENU MOVIE RECORD RESOPONCE IN ZEE 5 OTT TA

Varudu Kaavalenu : నాగ శౌర్య, రితూ వర్మల ‘వరుడు కావాలెను’ ఓటీటీ వేదికగా మరో రికార్డు..

నాగ శౌర్య ‘వరుడు కావలెను’ (Twitter/Photo)

నాగ శౌర్య ‘వరుడు కావలెను’ (Twitter/Photo)

Varudu Kaavalenu  - Naga Shourya :  యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన  ఫ్యామిలీ డ్రామా ‘వరుడు కావలెను’. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌లో ఈ సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇంకా చదవండి ...
    Varudu Kaavalenu  - Naga Shourya :  యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన  ఫ్యామిలీ డ్రామా ‘వరుడు కావలెను’. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై జస్ట్ ఓకే అనిపించింది. కొన్ని సినిమాలు టాక్ బాగున్నా.. థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోవు. కానీ ఓటీటీ వేదికగా కొన్ని సినమాలు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటూ వుంటాయి. అలాంటి కోవలో ‘వరుడు కావాలెను’ మూవీ ఒకటి. ఈ సినిమాను లక్ష్మీ సౌజన్యను తెరకెక్కించారు. అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అయిన ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా సూపర్ హిట్ అయింది. రీసెంట్‌గా స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ .. ఓటీటీలో 3 రోజుల్లో 5 కోట్ల నిమిసాల వ్యూస్ అందుకున్నట్టు చిత్ర హీరో నాగ శౌర్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసారు.

    ఈ సినిమాను విశాల్ చంద్ర సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ వాళ్లు నిర్మించారు. ఇక నాగ శౌర్య ‘వరుడు కావలెను’ సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ  మంచి టాకే తెచ్చుకున్నా... అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ మాత్రం రాలేదు.  ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ కూడా బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది.








    View this post on Instagram






    A post shared by Naga Shaurya (@actorshaurya)





    అయితే.. వరుడు కావలెను’ మూవీ  ఓవర్సీస్‌లో మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.  ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి చాలా రోజుల తర్వాత డిజిటల్ డీల్ ముగిసింది. జనవరి 7న ఈ సినిమాను ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వరుడు కావలెను సినిమాను మొత్తంగా రూ. 8.6 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్‌గా అమ్మారు. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.  9 కోట్లు టార్గెట్‌తో బరిలోకి దిగింది. రూ. 2.50 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.

    Unstoppable with NBK : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో మరో రికార్డు.. మన దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో..

    ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.

    RajaShekar : మోహన్ బాబుతో ఆ కారణంగానే ఆ బ్లాక్ బస్టర్ మూవీ చేయలేదన్న రాజశేఖర్.. ఆలీతో టాక్ షోలో యాంగ్రీ మ్యాన్ సంచలన వ్యాఖ్యలు..

    ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంది. ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. ‘వరుడు కావలెను’ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో  నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Naga shaurya, Ritu varma, Tollywood, Varudu Kaavalenu, Zee5

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు