Home /News /movies /

NAGA SHAURYA RITU VARMA VARUDU KAAVALENU TO RELEASE ON OCTOBER 29 HERE ARE THE DETAILS SR

Naga Shaurya : అక్టోబర్ 29న విడుదలకానున్న నాగశౌర్య వరుడు కావలెను..

Varudu Kaavalenu Photo : Twitter

Varudu Kaavalenu Photo : Twitter

Naga Shaurya : నాగశౌర్య, పెళ్లి చూపులు బ్యూటీ రితూ వర్మ జంటగా వస్తోన్న సినిమా 'వరుడు కావలెను'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

    యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. అందులో భాగంగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నామని చిత్రబృదం గతంలో తేదిని ప్రకటించింది. వరుడు కావలెను  (Varudu Kaavalenu). అయితే ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయట్లేదని తెలిపింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైప ప్రచార చిత్రాలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి.

    ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.


    థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది.

    Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్ పిక్స్..

    ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్‌‌పైగా దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. ఇక అది అలా ఉంటే ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. అంతేకాదు డాన్స్ మాస్టర్ శేఖర్‌‌పై మండిపడ్డారు. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తుండగా... నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల టీజర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు.

    Samantha : విడాకుల తర్వాత సమంత ఫుల్ బిజీ... ఒకే రోజు రెండు సినిమాల ప్రకటన..

    ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ లక్ష్య (Lakshya) సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

    ఇక రితూ వర్మ (Ritu Varma) విషయానికి వస్తే.. ఆమె నాని సరసన టక్ జగదీష్‌లో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించింది. టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Naga shaurya, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు