Naga Shaurya : దసరా కానుకగా వరుడు కావలెను.. అధికారిక ప్రకటన..

Varudu Kaavalenu Photo : Twitter

Naga Shaurya : నాగశౌర్య, పెళ్లి చూపులు బ్యూటీ రితూ వర్మ జంటగా వస్తోన్న సినిమా 'వరుడు కావలెను'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. దసరా కానుకగా వరుడు కావలెను విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది.

  • Share this:
    యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను విడుదల చేసింది చిత్రబృందం. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నామని చిత్రబృదం తేదిని ప్రకటించింది. వరుడు కావలెను  (Varudu Kaavalenu)చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

    తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది.



    ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. ఇక అది అలా ఉంటే ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. అంతేకాదు డాన్స్ మాస్టర్ శేఖర్‌‌పై మండిపడ్డారు.

    Love Story : మొదటి రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర లవ్ స్టోరి ప్రభంజనం..

    ఈ పాట దేవుడిని కించపరిచేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్త వచ్చిన సంగతి తెలిసిందే. నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ రచన ఉందని ఆమె నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తూ..అనం త శ్రీరామ్‌తో పాటు ఆ సినిమా యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    Rashmi Gautam: చీరలో వయ్యారాలు ఒలకబోసిన రష్మి గౌతమ్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

    ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల టీజర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు.

    ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ లక్ష్య (Lakshya) సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

    ఇక రితూ వర్మ (Ritu Varma) విషయానికి వస్తే.. ఆమె నాని సరసన టక్ జగదీష్‌లో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించింది. టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published: