యువ హీరో నాగశౌర్య హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసింది. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు. థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది.
ఇక మరోవైపు మొన్నటి వరకు వరుడు కావలెను అనే సినిమా ట్రోలింగ్‌కు గురైంది. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అంతేకాదు డాన్స్ మాస్టర్ శేఖర్‌పై మండిపడ్డారు. అది అలా ఉంటే ఈ పాట వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల టీజర్ మంచి ఆదరణ పొందింది.
#VaruduKaavalenu shoot has been wrapped up
Coming soon to theatres near you to fill your hearts with love & emotions! @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @NavinNooli @SitharaEnts @adityamusic pic.twitter.com/rPfJrsfbeM
— BARaju's Team (@baraju_SuperHit) August 7, 2021
ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు. ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ లక్ష్య సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇవి కూడా చూడండి :
Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...
Chiranjeevi : చిరంజీవికి చెల్లెలుగా ఆ యువ హీరోయిన్ ఖరారు.. భారీగా డిమాండ్..
Anchor Vishnupriya : లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news