Varudu Kaavalenu - Naga Shourya : యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘వరుడు కావలెను’. ఈ సినిమా అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై జస్ట్ ఓకే అనిపించింది. వరుడు కావలెను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాకే తెచ్చుకున్నా... అనుకున్న రేంజ్‌లో కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన ‘లక్ష్య’ కూడా బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. అయితే.. వరుడు కావలెను’ మూవీ ఓవర్సీస్‌లో మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి చాలా రోజులు అవుతున్న ఇప్పటికీ డిజిటల్ డీల్ పూర్తి కాలేదు.
తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ 5 కొనుగోలు చేసింది. ఈ సినిమాను జనవరి 7న ’ఆర్ఆర్ఆర్’ విడుదల రోజున జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు జీ 5 తన ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
Two different worlds of #Bhoomi & #Akash can never be one! Here’s the trailer of #VaruduKavalenu ?
Watch the epic tale of love & destiny #VaruduKaavalenuOnZEE5, premieres Jan 7th exclusively on #ZEE5.@IamNagashaurya @riturv @Composer_Vishal @MusicThaman @LakshmiSowG pic.twitter.com/CVhmMNrQoE
— ZEE5 Telugu (@ZEE5Telugu) December 28, 2021
వరుడు కావలెను సినిమాను మొత్తంగా 8.6 కోట్ల రేంజ్ రేటుకి వరల్డ్ వైడ్‌గా అమ్మారు. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్లు టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.74 కోట్ల షేర్’ని ఇంకా అందుకోవాల్సి ఉంది.ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంది. ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. ‘వరుడు కావలెను’ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga shourya, Ritu varma, Tollywood, Varudu Kaavalenu