Naga Shaurya : సెన్సార్ పూర్తి చేసుకున్న నాగశౌర్య వరుడు కావలెను..

Varudu Kaavalenu Censor : Photo : Twitter

Naga Shaurya : నాగశౌర్య, పెళ్లి చూపులు బ్యూటీ రితూ వర్మ జంటగా వస్తోన్న సినిమా 'వరుడు కావలెను'. ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

 • Share this:
  యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. అందులో భాగంగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తున్నామని చిత్రబృదం గతంలో తేదిని ప్రకటించింది. వరుడు కావలెను  (Varudu Kaavalenu). అయితే ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయట్లేదని తెలిపింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృంద.

  ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైప ప్రచార చిత్రాలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.


  థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది.

  Oscar : ఆస్కార్ బరిలో మన దేశం తరుపున షార్ట్ లిస్ట్‌లో సర్ధార్ ఉధమ్, విద్యా బాలన్ షేర్ని..

  ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్‌‌పైగా దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్‌ను రాబట్టింది. ఇక అది అలా ఉంటే ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. అంతేకాదు డాన్స్ మాస్టర్ శేఖర్‌‌పై మండిపడ్డారు. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తుండగా... నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  Shyam Singha Roy : భారీ ధర పలికిన నాని శ్యామ్ సింగ రాయ్ ఆడియో రైట్స్‌..

  ఇక నాగశౌర్య నటిస్తున్న మరో సినిమా లక్ష్య. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల టీజర్ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎయిట్ ఫ్యాక్ బాడీతో నాగశౌర్య అదరగొడుతున్నారు.

  ఆర్చరీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ లక్ష్య (Lakshya) సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: