యువ కథానాయకుడు నాగశౌర్య ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ లక్ష్యలో నటిస్తున్నాడు. ఆర్చరీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న సినిమాల్లో తొలి సినిమానే చెప్పాలి. విలువిద్య అనేది ఒలింపిక్స్‌లో ఓ గేమ్. అలాంటి గేమ్‌కు సంబంధించిన ఓ సినిమా అంటే.. ఏదో ఆషామాషీ చేసేయాలని కాకుండా నాగశౌర్య సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు. సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచాడు. అలాగే విలువిద్యకు సంబంధించిన ప్రత్యేకమైన తరగతులకు కూడా వెళ్లాడట నాగశౌర్య. ఆర్చరీలో సీనియర్ ప్లేయర్స్‌ను కలుసుకుని దానికి సంబంధించిన స్పెషల్ వర్క్ అంతా కూడా చేశాడట. ఇంత కష్టపడటానికి కారణం సినిమాలో కనిపించేటప్పుడు చాలా నేచురల్‌గా కనిపించాలనే తాపత్రయం. ఇదే శౌర్య కమిట్మెంట్ అని చిత్ర యూనిట్ చెబుతుంది. అసలు బాణాలు ఎలా పట్టుకోవాలి.. ఎలా సంధించాలి.. తదితర విషయాలను నాగశౌర్య సీనియర్స్ దగ్గర నేర్చుకున్నాడట. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు నాగశౌర్య వరుడు కావాలి సినిమాలోనూ నటిస్తున్నాడు. తన సొంత బ్యానర్‌లోనూ ఓ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నాడు. ఈ సినిమాకు అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకుడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాగశౌర్య .. ఆ సినిమాతో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు. క్రమంగా హీరోగా బిజీ అవుతూ వచ్చాడు. అదే సమయంలో తనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి నిర్మాతగా మారాడు. హీరోగా.. నిర్మాతగా నాగశౌర్య చేసిన తొలి చిత్రం ఛలో. ఈ సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్గా తెలుగులో పరిచయం అయ్యింది. ఈ సినిమా చాలా మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే నిర్మాతగా తర్వాత నాగశౌర్య రెండు సినిమాలు చేశాడు. అందులో ఓ సినిమా నర్తనశాల. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ నాగశౌర్య నిర్మిస్తూ నటించిన సినిమా అశ్వథ్థామ. ఈ సినిమాకు తనే కథను కూడా అందించాడు.ఈ సినిమా కోసం తొలిసారి నాగశౌర్య ఫిజికల్ లుక్ మార్చాడు. మాస్ లుక్ కోసం బాడీ పెంచాడు. అయితే ఎన్ని చేసినా సినిమా మాత్రం సక్సెస్ కాలేదు. డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు నాలుగో సినిమాను నిర్మిస్తున్నాడు. ఇతర నిర్మాణ సంస్థల్లోనూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నాగశౌర్యకి నిర్మాతగా సక్సెస్ కావాలి.. హీరోగానూ సక్సెస్ కావాలి. మరి రాబోయే చిత్రాలతో హిట్స్ కొట్టి నాగశౌర్య సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga shaurya, News telugu, Telugu Movie News